క్రీడాభూమి

బాడ్మింటన్ వీరుడికి ప్రముఖుల ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. కెరీర్‌లో నాలుగోసారి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన శ్రీకాంత్‌ను మోదీ అభినందించారని పిఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాంత్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రశంసించారు. గత వారం ఇండోనేషియా ఓపెన్‌ను సాధించి, ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌ను అందుకున్న శ్రీకాంత్ భారత కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేశాడని మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు. అతనిని చూసి గర్విస్తున్నానని తెలిపాడు. శ్రీకాంత్ భవిష్యత్తులోనూ ఇలాంటి టైటిళ్లు ఎన్నింటినో సాధిస్తాడన్న నమ్మకం తనకు ఉందని మరో మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ తన ట్విటర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. భారత్ బరిలోకి దిగితే, టైటిళ్లు సాధించడం మిగతా దేశాల వారికి కష్టమవుతున్నదని శ్రీకాంత్ సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించాడు. వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించడం అనుకున్నంత సులభం కాదని డెన్మార్క్ షట్లర్ మథియాస్ బయే వ్యాఖ్యానించాడు. భారత జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీందర్, భారత హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్క్విన్హా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, హాకీ ఆటగాడు రూపీందర్ పాల్ సింగ్ తదితరులు కూడా శ్రీకాంత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.