క్రీడాభూమి

హెచ్‌ఐఎల్ విజేత పంజాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టైటిల్‌ను జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కళింగ లాన్సర్స్‌ను ఢీకొన్న ఈ జట్టు 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. లీగ్ దశ ముగిసే సమయానికి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హాట్ ఫేవరిట్ రాంచీ రేస్‌ను ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఓడించిన ఢిల్లీ వేవ్‌రైడర్స్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. కాగా, అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఊహించిన టైటిల్ పోరు ఏకపక్షంగా కొనసాగింది. మ్యాచ్ మొదలైన మరుక్షణం నుంచే పంజాబ్ జట్టు దూకుడుగా ఆడింది. నాలుగో నిమిషంలోనే అర్మాన్ ఖురేషి ఫీల్డ్ గోల్ చేయడంతో ఆ జట్టుకు 2-0 ఆధిక్యం లభించింది. అనంతరం పంజాబ్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, ఈక్వెలైజర్ కోసం కళింగ పోరాటాన్ని ఆరంభించింది. 24వ నిమిషంలో మోరిజ్ ఫస్టే ద్వారా కళింగకు గోల్ లభించింది. అయితే, అది పెనాల్టీ కార్నర్ ద్వారా లభించిన గోల్ కావడంతో కళింగ స్కోరును సమం చేయలేకపోయింది. కాగా, కళింగ గోల్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పంజాబ్ ఆటగాళ్లు ఎదురుదాడికి ఉపక్రమించడంతో పోరు ఆసక్తికరంగా మారింది. 39వ నిమిషంలో మాట్ గోడ్స్, 42వ నిమిషంలో సత్బీర్ సింగ్ ఫీల్డ్ గోల్స్ సాధించారు. ఫలితంగా పంజాబ్ ఖాతాలో మరో నాలుగు గోల్స్ చేరాయి. అదే ఆధిక్యాన్ని కొనసాగించిన పంజాబ్ 6-1 తేడాతో కళింగను చిత్తుచేసింది. ఇలావుంటే, మూడో స్థానానికి ఢిల్లీ వేవ్‌రైడర్స్, రాంచీ రేస్ మధ్య జరిగిన ప్లే ఆఫ్ పోరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మితిమీరిన డిఫెన్స్‌తో ఇరు జట్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. 18వ నిమిషంలో డెడ్‌లాక్‌ను బద్దలు చేస్తూ మన్దీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్‌ను సాధించాడు. దీనితో ఢిల్లీకి 2-0 ఆధిక్యం లభించింది. ఆతర్వాత రాంచీని గోల్స్ చేయకుండా అడ్డుకోవడానికే ప్రాధాన్యతనిచ్చిన ఢిల్లీ తన ప్రయత్నంలో సఫలమైంది. మూడో స్థానాన్ని సంపాదించింది.

చిత్రం... హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఫైనల్‌లో కళింగ లాన్సర్స్‌ను ఓడించి టైటిల్ సాధించిన జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు