క్రీడాభూమి

బోల్టన్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 26: మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నికోల్ బోల్టన్ అజేయ శతకంతో రాణించడంతో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 47.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (46), కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ (46) తప్ప మిగతా వారంతా విఫలమయ్యారు. ఆతర్వాత ఆస్ట్రేలియా మరో 71 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. ఈ జట్టు 38.1 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగులు చేసింది. బోల్టన్ 116 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లతో 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఓపెనర్ బెత్ మూనీ (70)తో కలిసి మొదటి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.

చిత్రం.. నికోల్ బోల్డన్
(107 నాటౌట్)