క్రీడాభూమి

శ్రీనివాసన్ అభ్యంతరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎస్‌జిఎంలో విశ్వప్రయత్నం చేసినట్టు సమాచారం. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడి హోదాలో దొడ్డిదారిన ఎస్‌జిఎంకు హాజరైన అతను పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. తనకు మద్దతుగా ఉన్న కొన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో కలిసి, లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. కమిటీని ఏర్పాటు చేస్తే, సిఫార్సులను అమలు పరచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వాదించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో లోధా ప్రతిపాదనలను ఆమోదించకుండా ఉండాలని, అంతేగాక, సుప్రీం కోర్టులో తాజాగా మళ్లీ పిటిషన్‌ను దాఖలు చేయాలని సూచించాడు. అయితే, అతని అభ్యంతరాలను మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించారు.