క్రీడాభూమి

ఆకట్టుకున్న కుల్దీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: విలక్షణమైన ‘చైనామన్’ బౌలింగ్‌తో 22 ఏళ్ల భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో అతను అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. అందులో నాలుగు వికెట్లు కూల్చాడు. వెస్టిండీస్ టూర్‌కు ఎంపికై, మొదటి వనే్డలో ఆడాడు. అయితే, భారత్ ఇన్నింగ్స్ పూర్తి కాకముందే భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోవడంతో, మ్యాచ్‌ని రద్దు శారు. కాగా, రెండో మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం లభించడంతో, దానిని అతను సద్వినియోగం చేసుకున్నాడు. కెరీర్‌లో అతనికి ఇది రెండో వనే్డ. కానీ, బౌలింగ్ చేసే అవకాశం దక్కిన మొదటి మ్యాచ్. దీనిని అతను సద్వినియోగం చేసుకున్నాడు. బంతిని స్టంప్స్‌కు ఇరువైపులా స్పిన్ చేసి, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. మూడు వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో తన వంతు పాత్రను పోషించాడు. సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో బౌల్ చేయలేకపోవడంతో, జట్టులో స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశాలను కుల్దీప్ మెరుగుపరచుకున్నాడు.