క్రీడాభూమి

300 ప్లస్ స్కోర్లలో భారత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పర్యాయాలు 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు వనే్డలో ఐదు వికెట్లకు 310 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. 1996 ఏప్రిల్ 15న షార్జాలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారి మూడు వందల మైలురాయిని దాటిన భారత్, ఇప్పుడు మిగతా జట్లను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 95 పర్యాయాలు 300 ప్లస్ స్కోర్లు సాధించగా, భారత్ ఈ ఘనతను అందుకోవడం ఇది 96వ సారి. దక్షిణాఫ్రికా (77) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.