క్రీడాభూమి

మూడో వనే్డలో పంత్‌కు చోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 26: వెస్టిండీస్‌తో ఈనెల 30న అంటిగువాలో జరిగే మూడో వనే్డ ఇంటర్నేషనల్‌లో యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరోక్షంగా వెల్లడించాడు. విండీస్‌తో జరిగిన రెండో వనే్డను 105 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న భారత్ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలుకావడంతో, 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్కలు 310 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అజింక్య రహానే (103) సెంచరీతో కదంతొక్కగా, శిఖర్ ధావన్ (63), కోహ్లీ (87) అర్ధ శతకాలు నమోదు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్ 73 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
భారత్‌ను ఓడించేందుకు 311 పరుగుల భారీ స్కోరు చేయాల్సి ఉండగా, పరుగుల ఖాతా తెరవక ముందే మొదటి వికెట్‌ను ఓపెనర కీరన్ పావెల్ (0) రూపంలో కోల్పోయిన వెస్టిండీస్‌కు నాలుగు పరుగుల వద్ద జాసన్ మహమ్మద్ (0) వెనుదిరగడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. షాయ్ హోప్ (81), చివరిలో రోస్టన్ ఛేజ్ (33 నాటౌట్) కొంత వరకు భారత్ బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 205 పరుగులు చేయగలిగింది. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 50 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. భువనేశ్వర్ ఐదు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌ని భారత్ తన ఖాతాలో వేసుకొని, విండీస్‌పై ఆధిక్యాన్ని సంపాదించింది. స్టార్ ఆటగాళ్లు ఎవ రూ లేని కారణంగా విండీస్‌ను ద్వితీయ శ్రేణి జట్టుగా పేర్కొంటున్నారు. అందుకే భారత్ విజయం సులభ మైందన్న వాదన కూడా ఉంది. అయతే, టీమిండియా సమష్టిగా రాణించి విజయం సాధించిందని కెప్టెన్ కోహ్లీ వాదిస్తున్నాడు.
జట్టు సమతూకంగా ఉంది
భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే కొన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. విండీస్‌తో జరిగే మిగతా మూడు మ్యాచ్‌ల్లో పంత్ లాంటి కొంత మంది ఆడే అవకాశాలు లేకపోలేదన్నాడు. ధోనీకి సరైన వారసుడిగా ఇప్పటికే ముద్రపడిన పంత్ ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టి-20 మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో 14 మ్యాచ్‌లు ఆడి, 366 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో స్టాండ్ బైస్‌గా ఎంపికైన ఐదుగురు ఆటగాళ్లలతో పంత్ ఒకడు. వెస్టిండీస్ టూర్ నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు పంత్‌ను ఎంపిక చేశారు. నిలకడగా రాణిస్తున్న పంత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని కోహ్లీ అన్నాడు. అంటిగువాకు వెళ్లిన తర్వాత, అక్కడి వాతావరణం, పిచ్ తీరును పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, రహానే రాకవల్ల ఒక అదనపు బౌలర్‌తో మ్యాచ్ ఆడే అవకాశం తమకు లభించిందని కోహ్లీ చెప్పాడు. టెస్టుల్లో రహానే ఇప్పటికే ప్రతిభను నిరూపించుకున్నాడని, వనే్డ ఫార్మాట్‌లోనూ అతను రాణిస్తాడని ఈ మ్యాచ్ స్పష్టం చేసిందని చెప్పాడు. భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి, జట్టు విజయానికి తోడ్పడ్డాడని చెప్పాడు. జట్టు ప్రస్తుతం సమ తూకంతో ఉందన్నాడు. 2019 వరల్డ్ కప్ నాటికి అన్ని విభాగాల్లోనూ మరింత బలపడతామని చెప్పాడు. విండీస్‌పై రెండో వనే్డను సమష్టి కృషితో గెల్చుకున్నామని, మిగతా వనే్డల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని కోహ్లీ అన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా 105 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం పడడంతో, ఆట ఆలస్యంగా మొదలైంది. దీనితో మ్యాచ్‌ని 43 ఓవర్లకు కుదించారు. అజింక్య రహానే సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఐదు వికెట్లకు 310 పరుగులు సాధించింది. అనంతరం విండీస్‌ను ఆరు వికెట్లకు 205 పరుగులకే కట్టడి చేసి, విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతున్న టీమిండియాకు ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. క్రిస్ గేల్ వంటి మేటి క్రికెటర్లు ఎవరూ లేని కారణంగా, అనుభవం లేని ఆటగాళ్లతో తలపడాల్సి రావడం భారత్‌కు కలిసొచ్చిన అంశం.

రెండో వనే్డ స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే బి మిగుల్ కమిన్స్ 103, శిఖర్ ధావన్ స్టంప్డ్ షాయ్ హోప్ బి ఆష్లే నర్స్ 63, విరాట్ కోహ్లీ సి ఆష్లే నర్స్ బి అల్జారి జోసెఫ్ 87, హార్దిక్ పాండ్య సి మిగుల్ కమిన్స్ బి అల్జారి జోసెఫ్ 4, యువరాజ్ సింగ్ సి షాయ్ హోప్ బి జాసన్ హోల్డర్ 14, మహేంద్ర సింగ్ ధోనీ 13 నాటౌట్, కేదార్ జాదవ్ 13 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (43 ఓవర్లలో 5 వికెట్లకు) 310.
వికెట్ల పతనం: 1-114, 2-211, 3-223, 4-254, 5-285.
బౌలింగ్: అల్జారి జోసెఫ్ 8-0-73-2, జాసన్ హోల్డర్ 8.5-0-76-1, ఆష్లే నర్స్ 9-0-38-1, దేవేంద్ర బిషూ 9-0-60-0, మిగుల్ కమిన్స్ 8-0-57-1, జొనథాన్ కార్టర్ 0.1-0-2-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కీరన్ పావెల్ సి మహేంద్ర సింగ్ ధోనీ బి భువనేశ్వర్ కుమార్ 0, షాయ్ హోప్ ఎల్‌బి కుల్దీప్ యాదవ్ 81, జాసన్ మహమ్మద్ సి హార్దిక్ పాండ్య బి భువనేశ్వర్ కుమార్ 0, ఎవిన్ లూయిస్ స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి కుల్దీప్ యాదవ్ 21, జొనథాన్ కార్టర్ ఎల్‌బి అశ్విన్ 13, జాసన్ హోల్డర్ స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి కుల్దీప్ యాదవ్ 29, రోస్టన్ ఛేజ్ 33 నాటౌట్, ఆష్లే నర్స్ 19 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (43 ఓవర్లలో 6 వికెట్లకు) 205.
వికెట్ల పతనం: 1-0, 2-4, 3-93, 4-112, 5-132, 6-174.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5-1-9-2, ఉమేష్ యాదవ్ 6-0-36-0, హార్దిక్ పాండ్య 9-0-32-0, రవిచంద్రన్ అశ్విన్ 9-0-47-1, కుల్దీప్ యాదవ్ 9-0-50-3, యువరాజ్ సింగ్ 5-0-25-0.