క్రీడాభూమి

త్రోబాల్‌లో చరిత్ర సృష్టించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: నేపాల్ రాజధాని ఖాడ్మండూలో జరిగిన వరల్డ్ గేమ్స్‌లో భారత త్రోబాల్ జట్లు చరిత్ర సృష్టించాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఈ గేమ్స్‌లో భారత పురుష, మహిళా జట్లు పసిడి పతకాలను కైవసం చేసుకున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా జరిగిన మహిళల ఫైనల్‌లో భారత జట్టు 15-13, 15-12 పాయింట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించగా, ఉత్కంఠ భరితంగా సాగిన పురుషల ఫైనల్‌లో కూడా భారత జట్టు 15-13, 15-12 తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత త్రోబాల్ జట్లు వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ స్పోర్ట్ కౌన్సిల్ (కెనడా) ఆధ్వర్యంలో జరిగిన ఈ గేమ్స్‌లో 11 దేశాలకు చెందిన జట్లు 42 విభాగాల్లో పోటీపడ్డాయి. ఈ గేమ్స్‌లో విజయభేరి మోగించి టైటిళ్లు సాధించిన భారత జట్లకు భారత త్రోబాల్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి నరేష్ మాన్ అభినందనలు తెలిపాడు. వరల్డ్ గేమ్స్‌లో విజయం సాధించేందుకు భారత క్రీడాకారులు ఎంతగానో శ్రమించారని, ఇకముందు కూడా వీరు ఇదేవిధంగా రాణించి దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేయగలరని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ గేమ్స్ త్రోబాల్ సెమీ ఫైనల్‌లో భారత పురుషుల జట్టు 15-9, 15-10 తేడాతో మలేషియాను చిత్తు చేయగా, మహిళల జట్టు కూడా 15-10, 15-11 తేడాతో మలేషియాపైనే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.