క్రీడాభూమి

ఎన్నో రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఖాతాలో చాలా రికార్డులే ఉన్నాయ. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్న మెక్‌కలమ్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభానికి ముందు 99 టెస్టులు ఆడాడు. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అతనికి కెరీర్‌లో వందవది. ఒక్క మ్యాచ్‌కి కూడా దూరంకాకుండా వరుసగా వంద టెస్టులు ఆడిన క్రికెటర్‌గా అతను ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డును పంచుకున్నాడు. రెండో టెస్టులో పాల్గొనడం ద్వారా గిల్‌క్రిస్ట్ రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో అత్యధికంగా 105 సిక్సర్లు కొట్టిన అతని ఖాతాలో అత్యధిక టి-20 సిక్సర్ల రికార్డు కూడా ఉంది. 2012లో రాస్ టేలర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన కివీస్ సెలక్టర్లు ఆ బాధ్యతను మెక్‌కలమ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి అతను 33 టెస్టుల్లో నాయకత్వం వహించాడు. 11 విజయాలు సాధించాడు. 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. పది టెస్టుల్లో కివీస్ ఓటమిపాలైంది. ఇప్పుడు జరుగుతున్న చివరి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్నది.
2004 మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను అప్పటి నుంచి ఒక్క సిరీస్‌లోనూ విరామం తీసుకోకుండా 101 టెస్టులు ఆడాడు. ఒక జట్టు ఆడిన వంద వరుస టెస్టుల్లో ఒక్క దానికి కూడా, ఏ కారణంగానూ గైర్హాజరు కాకుండా ఆడిన క్రికెటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. హాగ్లే ఓవల్ మైదానంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత తాను అన్ని ఫార్మెట్స్ నుంచి వైదొలగనున్నట్టు అతను ఇది వరకే ప్రకటించాడు.
క్రైస్ట్‌చర్చిలోని హాగ్లే ఓవల్ మైదానంలో మెక్‌కలమ్ ఆడిన గత ఐదు ఇన్నింగ్స్‌లోనూ యాభైకంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. రెండు టెస్టుల్లో వరుసగా 195, 145 చొప్పు పరుగులు చేసిన అతను ఆతర్వాత మూడు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 51, 65, 55 చొప్పున పరుగులు చేశాడు. తాజాగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులు సాధించిన మెక్‌కలమ్ రెండో టెస్టులో యాభై పరుగుల మైలురాయిని అధిగమించలేకపోయాడు.
తన కెరీర్‌లోని చివరి టెస్టులో బ్రెండన్ మెక్‌కలమ్ 170 పరుగులు సాధించాడు. ఒక కెప్టెన్ తన చివరి టెస్టులో సాధించిన అత్యధిక పరుగులు ఇవే. వెస్టిండీస్‌కు నాయకత్వం వహించిన కార్ల్ నూనెన్స్ 1929-30 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై కింగ్‌స్టన్‌లో చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 66, రెండో ఇన్నింగ్స్‌లో 92 చొప్పున మొత్తం 158 పరుగులు చేశాడు. ఆ రికార్డును మెక్‌కలమ్ బద్దలు చేశాడు. మైదానంలోకి దిగిన మరుక్ష ణం నుంచే బౌలర్లపై విరుచుకుపడే తత్వమున్న మెక్‌కల మ్‌ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయడమే ప్రత్యర్థి జట్లు లక్ష్యంగా ఎంచుకోవడం అతను ఆడే ప్రతి మ్యాజ్ లోనూ కనిపించే దృశ్యం. ప్రపంచ క్రికెట్‌పై అతను తన దైన ముద్ర వేశాడు.