క్రీడాభూమి

ఐపిఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగనున్న ‘వివో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ మరో ఐదేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లకు టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగనుంది. ఈ సంస్థ భారీ మొత్తంలో 2,199 కోట్ల రూపాయలకు బిడ్ దాఖలు చేసి మంగళవారం టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను నిలబెట్టుకుంది. ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం గతంలో ఈ సంస్థ కుదుర్చుకున్న కాంట్రాక్టు మొత్తం కంటే ఇది 554 శాతం ఎక్కువ. ఐపిఎల్ టోర్నమెంట్‌కు ఇప్పటికే టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న వివో తాజాగా భారీ మొత్తంలో రూ.2,199 బిడ్ దాఖలు చేసి మరోసారి హక్కులను కైవసం చేసుకుందని, దీంతో ఆ సంస్థ మరో ఐదు సీజన్ల పాటు (2018 నుంచి 2022 వరకు) ఐపిఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఈ సంస్థ నుంచి బిసిసిఐకి ఏటా సుమారు 440 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. కాసుల పంట పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి 2022 జూలై 31వ తేదీ మధ్య కాలంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బిసిసిఐ గత నెలలో బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే 2016, 2017 మధ్య రెండు సీజన్లలో ఐపిఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించేందుకు ఏటా దాదాపు 100 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా బిసిసిఐతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ‘వివో’ సంస్థ ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో రూ.2,199 కోట్ల భారీ మొత్తానికి బిడ్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, వివో మరోసారి తమతో చేతులు కలిపి మరో ఐదేళ్లు ఐపిఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించబోతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. వివో సంస్థతో తమ అనుబంధం గత రెండు సీజన్లలో ఎంతో గొప్పగా ఉందని, మున్ముందు ఈ అనుబంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పాడు.
ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను మరోసారి ‘వివో’ కైవసం చేసుకోవడంతో రూ.1,430 కోట్లకు బిడ్ దాఖలు చేసిన మరో మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ ‘ఒప్పో’ ఈ రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఆరంభమైన 2008 నుంచి 2012 వరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించగా, 2013లో ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ ‘పెప్సీ’ రూ.396 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఐదేళ్ల కాలానికి ఈ హక్కులను చేజిక్కించుకుంది. అయితే 2014-15లో ఈ హక్కులను వివో టేకోవర్ చేసిన విషయం తెలిసిందే.