క్రీడాభూమి

అమెరికా క్రికెట్ జట్టులో నల్లగొండ యువతికి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్ గ్రామానికి చెందిన సింధూజ రెడ్డి అమెరికా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గతంలో ఆమె హైదరాబాద్ మహిళా జట్టు తరఫున రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడింది. అలాగే అండర్-19 క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్-19 భారత జట్టు సభ్యురాలిగా పలు పోటీల్లో పాల్గొంది. బిటెక్, ఎంబిఎ చదివిన సింధూజ రెడ్డి ఇటీవల అమెరికాలో స్థిరపడిన సిద్ధారెడ్డిని వివాహం చేసుకుంది. దీంతో ఆమె కూడా అమెరికాలోనే స్థిరపడింది. ఐసిసి ఇటీవల అమెరికా క్రికెట్ జట్టును గుర్తించింది. ఐసిసి టోర్నీలో ఆడే అమెరికా మహిళా క్రికెట్ జట్టును ఇటీవల ఎంపిక చేశారు. దానిలో సింధూజ రెడ్డి ఎంపికైంది. స్కాట్లాండ్‌లో జరిగే మహిళా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ కోసం అమెరికా తరఫున ఆమె పాల్గొంటుంది. సింధూజరెడ్డి చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ చూపేదని ఆమె తల్లిదండ్రులు గడ్డం సురేందర్‌రెడ్డి లక్ష్మీరెడ్డి పేర్కొంటూ, అమెరికా జట్టులో సింధుజకు చోటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమెరికా జట్టుకు ఆమె వికెట్ కీపర్/ బ్యాట్స్ ఉమెన్‌గా సేవలు అందించనునుంది.

చిత్రం.. సింధూజ రెడ్డి