క్రీడాభూమి

రేసులోకి రవిశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ సిద్ధమవుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తులు సమర్పించే గడువును జూలై 9వ తేదీ వరకు పొడిగించాలని బిసిసిఐ నిర్ణయించడంతో రేసులో దిగేందుకు రవిశాస్ర్తీ చాలా ఆసక్తితో ఉన్నట్లు అతని సన్నిహితుడు ఒకరు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. అయితే 2019లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసే వరకూ పూర్తిగా రెండేళ్ల పాటు తనకు కాంట్రాక్టు ఇస్తామని బిసిసిఐ నుంచి హామీ లభిస్తేనే అతను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే తనను కోచ్‌గా నియమించిన పక్షంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సహా తనకు ఇష్టమున్న వారిని సపోర్టింగ్ స్ట్ఫాగా నియమించుకునే వెసులుబాటు కల్పించాలని కూడా రవిశాస్ర్తీ కోరనున్నట్లు తెలుస్తోంది. 2014 ఆగస్టు నుంచి టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్ర్తీని 2016 జూన్‌లో తొలగించి స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లేని భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన విషయం విదితమే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తలెత్తిన విభేదాల కారణంగా కుంబ్లే ఇటీవల రాజీనామా చేయడంతో ప్రధాన కోచ్ పదవికి ఖాళీ ఏర్పడింది. కోహ్లీకి, రవిశాస్ర్తీకి మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో టీమిండియా కోచ్ పదవిలో రవిశాస్ర్తీని నియమించాలని కోహ్లీ కూడా కోరుకుంటున్నాడు. రవిశాస్ర్తీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు టీమిండియా 2014లో ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించి పరిమిత ఓవర్ల సిరీస్‌లో విజయం సాధించడంతో పాటు 2015లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లోనూ, 2016లో జరిగిన ప్రపంచ టి-20 టోర్నీలోనూ సెమీ ఫైనల్స్‌కు చేరిన విషయం విదితమే. అలాగే రవిశాస్ర్తీ హయాంలో భారత జట్టు శ్రీలంక, దక్షిణాఫ్రికాల్లో జరిగిన టెస్టు సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన టి-20 సిరీస్‌లో కూడా విజయం సాధించింది.
అయితే కోహ్లీతో రవిశాస్ర్తీకి ఉన్నంత సాన్నిహిత్యం టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) సభ్యుడైన సౌరవ్ గంగూలీతో లేదు. గతంలో తాను టీమిండియా డైరెక్టర్ పదవి కోసం స్కైప్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ఇంటర్యూలో పాల్గొన్నప్పుడు గంగూలీ హాజరు కాలేదని రవిశాస్ర్తీ ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణకు గంగూలీ అప్పడే దీటుగా జవాబిచ్చాడు. టీమిండియా డైరెక్టర్ పదవిని చేపట్టాలన్న ఆసక్తి రవిశాస్ర్తీకి ఉంటే అతను వ్యక్తిగతంగా ఇంటర్వూకి హాజరు కావాలని గంగూలీ స్పష్టం చేశాడు.