క్రీడాభూమి

అదీ.. సాధిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఇండోనేసియా సూపర్ సిరీస్, తాజాగా ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిళ్లను దక్కించుకోవడంతో తిరిగి ప్రపంచ టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్న కిడాంబి శ్రీకాంత్ ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోవడంపై దృష్టిపెట్టాడు. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం కోసమే తాను ఆ టోర్నమెంట్‌లో ఆడుతానని చెప్పాడు.‘ తిరిగి టాప్ టెన్‌లోకి రావడం గొప్ప విషయమే. అయితే తిరిగి టాప్‌టెన్‌లోకి రావడం కోసం నేను అస్ట్రేలియన్ సూపర్ సిరీస్‌లో ఆడలేదు. దాన్ని గెలుచుకోవడం కోసమే ఆడాను’ అని మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ శ్రీకాంత్ అన్నాడు. చివరికి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైతం గెలవడం కోసమే ఆడతానని అతను అంటూ ర్యాంకింగ్స్ గురించి తాను ఆలోచించడం లేదని, దాన్ని గెలుచుకోవడం గురించే ఆలోచిస్తున్నానని చెప్పాడు. గత రెండు వారాలు తనకే కాకుండా ప్రణయ్, సాయి ప్రణీత్‌లకు కూడా అద్భుతంగా సాగిందని చెప్పాడు. ప్రణయ్ తనకన్నా ఎంతో మెరుగైన ర్యాకింగ్స్ ఆటగాళ్లయిన చోంగ్ వీ, చెన్‌లోంగ్‌లను వరస మ్యాచ్‌లలో ఓడించాడని, ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని అంటూ, అందుకు ప్రణయ్‌ని అభినందిస్తున్నానన్నాడు. మరింతగా నిలకడగా ఆడాలంటే నిరంతరం ప్రాక్టీస్ చేయడం అవసరమని శ్రీకాంత్ అభిప్రాయ పడ్డాడు. గోపీచంద్ శిక్షణ లేకుంటే తాను ఈ విజయాలు సాధించి ఉండే వాడిని కానని చెప్పాడు. ప్రతి విజయమూ గొప్పదేనని అంటూ, తన ప్రత్యర్థులే తాను రాటు దేలేలా చేశారని చెప్పాడు. కాగా, భారత క్రీడాకారులు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణిస్తున్నందుకు ప్రణయ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, యువ క్రీడాకారులు అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి తోడ్పాటు అందించిన గోపీచంద్ మాట్లాడుతూ, చాలామంది భారత క్రీడాకారులు రాణిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేవాడు. రాబోయే రోజుల్లో మన ఆటగాళ్ల ఆటతీరు మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
ఐడిబిఐ ఫెడరల్ నగదు పురస్కారాలు
కాగా, ఇండోనేసియన్ ఓపెన్ సూపర్ సిరీస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న కిడాంబి శ్రీకాంత్‌ను ఐడిబిఐ ఫెడరల్ తమ ‘క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్’ పథకంలో భాగంగా ఆరులక్షల రూపాయల నగదుతో సత్కరించింది. అలాగే ఇండోనేసియన్ సూపర్ సిరీస్‌లో ఒలింపిక్ చాంపియన్ చెన్‌లోంగ్, రజత పతక విజేత లీ చోంగ్ వీలను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరిన సాయి ప్రణయ్‌కి 2 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసినట్లు ఐడిబిఐ ఫెడరల్ చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ కార్తీక్ రామన్ ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్రం.. వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన శ్రీకాంత్