క్రీడాభూమి

న్యూ సౌత్ వేల్స్ జట్టులో అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: భారత సంతతికి చెందిన అర్జున్ నాయర్ ఆస్ట్రేలియాలోని మేటి క్రికెట్ క్లబ్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు)లో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల అర్జున్ ఆఫ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ‘దూస్రా’లను సంధించడంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. గురువారం నుంచి రెడ్‌బ్యాక్స్‌తో కాఫ్స్ హార్బర్‌లో జరిగే మ్యాచ్‌లో అర్జున్ ఆడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నారైన్ మాదిరి బౌలింగ్ యాక్షన్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న అర్జున్‌కు బంతిని వికెట్‌కు రెండు వైపులా టర్న్ చేసే నైపుణ్యం ఉంది. ఇటీవలే జరిగిన ఫ్యూచర్స్ లీగ్‌లో ఆడిన అతను 39.5 ఓవర్లు బౌల్ చేసి, 75 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో నాథన్ లియాన్ ఒక్కడే కీలక స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. స్టెఫెన్ ఒకీఫ్ చేతివేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరో స్పిన్నర్ విల్ సోంవిల్లే కూడా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే, ఎన్‌ఎస్‌డబ్ల్యులో అర్జున్ తన ప్రతిభను నిరూపించుకుంటే, ఆస్ట్రేలియా జట్టులోనూ అతనికి స్థానం దక్కే అవకాశం లేకపోలేదు.