క్రీడాభూమి

జూన్ 11న విజేందర్ టైటిల్ ఫైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తి, మూడు ఫైట్స్‌లో విజయాలను సాధించిన విజేందర్ సింగ్ టైటిల్ ఫైట్ జూన్ 11న ఉండవచ్చని సమాచారం. ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ టైటిల్ ఫైట్‌ను నిర్వహించడానికి ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబివో) అంగీకరించినట్టు విజేందర్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్సిస్ వారెన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సోనీ వాల్టింగ్‌తో తొలి ఫైట్‌లో పాల్గొన్న విజేందర్ మూడో రౌండ్‌లోనే ప్రత్యర్థిని చిత్తుచేశాడు. ఆతర్వాత డీన్ గిలెన్, సమెట్ హుసేనోవ్‌లతో జరిగిన ఫైట్స్‌లోనూ అతను నెగ్గాడు. వచ్చేనెల 12న అతను మరో ఫైట్‌లో పాల్గొంటాయి. ఇలావుంటే, ఇప్పటి వరకూ టైటిల్ ఫైట్‌కు అవకాశం దక్కని విజేందర్ జూన్ 11న జరిగే డబ్ల్యుబివో మిడిల్‌వెయిట్ లేదా సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో పోటీ పడే అవకాశం ఉంది. అదే అతనికి తొలి టైటిల్ ఫైట్ అవుతుంది.