క్రీడాభూమి

ఆస్ట్రేలియా 505 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 505 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా పట్టు బిగించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 14 పరుగులు వెనుకంజలో ఉండగా, ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 363 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, మరో 142 పరుగులు జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది. నైట్‌వాచ్‌మన్ నాథన్ లియాన్ 33, ఆడం వోగ్స్ 60 చొప్పున పరుగులు చేసి అవుటయ్యారు. మిచెల్ మార్ష్ (18), పీటర్ నెవిల్ (13), జేమ్స్ పాటిన్సన్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 153.1 ఓవర్లలో 505 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆలౌటయ్యే సమయానికి బర్డ్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 106 పరుగులిచ్చి 6 వికెట్లు కూల్చడం విశేషం.
కివీస్ తడబాటు
మొదటి ఇన్నింగ్స్‌లో 135 పరుగులు వెనుకబడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. లాథమ్ (39), మార్టిన్ గుప్టిల్ (0), నికోల్స్ (2), కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ (25) పెవిలియన్ చేరగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. కేన్ విలియమ్‌సన్ 45, కోరి ఆండర్సన్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జేమ్స్ పాటిన్సన్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటమి నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం తప్ప కివీస్ కు మరో మార్గం కనిపించ డం లేదు.

ఇన్నింగ్స్ ముగిసింది!

క్రైస్ట్‌చర్చి: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే రెండు మ్యాచ్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ఇది వరకే ప్రకటించిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్ ముగిసింది. ఇక్కడ జరుగుతున్న రెండవ, చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. దీనితో అతని అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. మెక్‌కలమ్ అవుటై, పెవిలియన్‌కు తిరిగి వెళుతున్న సమయంలో వేలాది మంది అభిమానులు నిలబడి హర్షధ్వానాలు చేస్తూ అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నప్పటికీ, రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ ముగియడంతో అతను ఫీల్డర్‌గానే మైదానంలోకి దిగుతాడే తప్ప తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన హార్డ్ హిట్టర్‌గా కాదు. కెరీర్‌లో 101 టెస్టులు ఆడిన అతను 6,453 పరుగులు సాధించాడు. 260 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 6,083 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (105) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన అతను టెస్టుల్లో అత్యంత వేగంగా, 54 బంతుల్లోనే శతకాన్ని సాధించి మరో రికార్డు సృష్టించాడు.

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో ఆలౌట్ 370 (బ్రెండన్ మెక్‌కలమ్ 145, కోరీ ఆండర్సన్ 72, వాట్లింగ్ 58, నాథన్ లియాన్ 3/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 363): 153.1 ఓవర్లలో 505 ఆలౌట్ (జో బర్న్స్ 170, స్టీవెన్ స్మిత్ 138, ఆడం వోగ్స్ 60, నాథన్ లియాన్ 33, నీల్ వాగ్నర్ 6/106, ట్రెంట్ బౌల్ట్ 2/108).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 44 ఓవర్లలో 4 వికెట్లకు 121 (లాథమ్ 39, కేన్ విలియమ్‌సన్ 45 నాటౌట్, బ్రెండన్ మెక్‌కలమ్ 25, జేమ్స్ పాటిన్సన్ 3/29).

మహిళల హాకీ
దక్షిణాఫ్రికా, భారత్
రెండో టెస్టు డ్రా
కేప్ టౌన్, ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టును భారత మహిళల హాకీ జట్టు డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ సాధించాయి. మ్యాచ్ ఆరంభమైన మూడో నిమిషంలోనే మారిజెన్ మరేస్ చేసిన గోల్‌తో దక్షిణాఫ్రికాకు 1-0 ఆధిక్యం లభించింది. 24వ నిమిషంలో భారత్‌కు గుర్జీత్ కౌర్ ద్వారా ఈక్వెలైజర్ లభించింది. ఈ గోల్ నమోదైన మరో నిమిషంలోనే దీప్ గ్రేస్ కౌర్ చక్కటి గోల్ చేసి, భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపింది. ఈ గోల్ నమోదైన తర్వాత దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు ముమ్మర దాడులకు ఉపక్రమించగా, భారత రక్షణ విభాగం వారిని నిలువరించే ప్రయత్నంలో పడింది. 34వ నిమిషంలో డిర్కీ చాంబర్లెయిన్ సాధించిన గోల్‌తో స్కోరును సమం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆతర్వాత రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. భారత్ కూడా అదే డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇవ్వడంతో మ్యాచ్ డ్రా అయింది. కాగా, ఈ ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించిన భారత మ హిళా హాకీ జట్టు ఆ మెగా టోర్నీకి సిద్ధమ య్యేందుకు వీలుగా టెస్టు మ్యాచ్‌లు ఆ డుతున్నది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వం టి జట్లను ఢీకొనడం ద్వారా ఒలింపిక్స్‌కు అన్నివిధాలా సన్నద్ధమయ్యేందుకు వీలు కలుగుతున్నది.

ఫలితం తేలని మలగా, రియల్ మాడ్రిడ్ మ్యాచ్
మాడ్రిడ్, ఫిబ్రవరి 22: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో మలగాను ఢీకొన్న రియల్ మాడ్రిడ్ డ్రాతో సంతృప్తి చెందింది. మ్యాచ్ 33వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో గోల్ సాధించి, రియల్ మాడ్రిడ్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఎదురుదాడి కొనసాగించిన మలగాకు 66వ నిమిషంలో రాల్ అబెన్టొసా ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత పోరు తీవ్ర స్థాయిలో కొనసాగినప్పటికీ ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. పెనాల్టీ కార్నర్‌లో ఎప్పుడూ ఉత్తమ ప్రతిభ కనబరచే రొనాల్డో అనూహ్యంగా ఒక చక్కటి అవకాశాన్ని చేజార్చుకోవడంతో రియల్ మాడ్రిడ్‌కు డ్రాతో సంతృప్తి చెందక తప్పలేదు. ఇకా ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, రయో వెలెకానో, సెవిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. అట్లెటికో బిల్బావోను రియల్ సోసియేడెడ్ 1-0 తేడాతో ఓడించింది. జొనథాస్ 17వ నిమిషంలో కీలక గోల్ చేసి సోసియేడెడ్‌ను గెలిపించాడు. గ్రనెడాతో జరిగిన మ్యాచ్‌ని వలెన్షియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అట్లాటికో మాడ్రిడ్, విల్లారియల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత బార్సిలోనా 63 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అట్లెటికో మాడ్రిడ్ 55 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ 54 పాయింట్లు సంపాదించి, మూడో స్థానంలో నిలిచింది.

అనుజ ఆల్‌రౌండ్ ప్రతిభ
శ్రీలంకపై భారత మహిళల విజయం
రాంచీ, ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. అనుజ పాటిల్ 22 పరుగులు సాధించడమేగాక, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత మహిళలు 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 36, స్మృతి మందాన 35, అనుజ పాటిల్ 22 పరుగులు చేశారు. లంక బౌలర్ సుగంధిక కుమారి 28 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

వృత్తిగా మారిన క్రికెట్: కపిల్ దేవ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: చాలా మంది యువకులకు క్రికెట్ ఒక వృత్తిగా మారిందని, ఇది శుభపరిణామనని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఇక్కడ జరిగిన 7వ గ్లోబర్ స్పోర్ట్స్ సమిట్‌లో పాల్గొన్న అతను మాట్లాడుతూ సుమారు 40 రోజులు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు 10 కోట్ల రూపాయలు దక్కడం అద్భుతమని అన్నాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని అన్నాడు. అప్పట్లో ఆదియా అంతమాత్రంగానే ఉండదని, అందుకే క్రికెట్‌ను ఒక వృత్తిగా స్వీకరించడానికి చాలా మంది వెనుకంజ వేసేవారని కపిల్ అన్నాడు. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపాడు. కార్పొరేట్ సంస్థల రంగ ప్రవేశంతో క్రికెట్ దశ తిరిగిందన్నాడు. క్రీడాభివృద్ధికి ఇది దోహదపడే అంశమని పేర్కొన్నాడు.