క్రీడాభూమి

జాగ్రత్తగా ఆడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌నీ జాగ్రత్తగా ఆడాలని టీమిండియా ఆటగాళ్లకు జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ సూచించాడు. విజయంతో టోర్నీని మొదలు పెడితే ఉత్సాహంగా ముందుకు వెళ్లగలుగుతామని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఆరంభంలో వెనుకబడి, ఆతర్వాత అత్యంత కీలకంగా మారే మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా ముందుకు దూసుకురావడం అనే ధోరణి పోవాలని అన్నాడు. బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు భారత్ 1-2 తేడాతో ఓటమిపాలైన విషయాన్ని ప్రస్తావించగా, అది సుమారు ఎనిమిది నెలల క్రితం చోటు చేసుకున్న సంఘటని అని రవి శాస్ర్తీ వ్యాఖ్యానించాడు. ఆ ఓటమి గురించి తామంతా ఎప్పుడో మరచిపోయామన్నాడు. తమ దృష్టి మొత్తం ఆసియా కప్ చాంపియ్‌షిప్‌పైనే కేంద్రీకృతమైందని స్పష్టం చేశాడు. టి-20 వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమయ్యేందుకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. ఈ టోర్నీలో భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.