క్రీడాభూమి

బలాబలాల విశే్లషణకు సిసలైన వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు జట్టు బలాబలాల విశే్లషణకు సిసలైన వేదికగా ఆసియా చాంపియన్‌షిప్ ఉపయోగపడుతుందని భారత టెస్టు జట్టు కెప్టెన్, సూపర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ టోర్నీని ఒక గొప్ప ప్యాకేజీగా అభివర్ణించాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఎదుర్కోవడం వల్ల టి-20 వరల్డ్ కప్ పోటీలకు అవసరమైన ప్రాక్టీస్ లభిస్తుందని అన్నాడు. అంతేగాక, జట్టు బలాబలాలను విశే్లషించుకోవడానికి కూడా ఈటోర్నీ ఉపయోగపడుతుందని చెప్పాడు. టి-20 వరల్డ్ కప్‌లో ఆడే జట్లకు ఏ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతాం? ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? వంటి ప్రశ్నలకు ఆసియా కప్‌లో సమాధానాలు వెతుక్కోవచ్చని అన్నాడు. ఆసియా కప్ ఎప్పుడూ సవాళ్లను విసురుతునే ఉంటుందని, ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డాలని కోహ్లీ అన్నాడు.
ఇప్పుడే చెప్పలేం..
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పలేమని కోహ్లీ అన్నాడు. బ్యాకప్‌గా పార్థీవ్ పటేల్ జట్టుతో చేరిన విషయాన్ని అతను ధ్రువీకరించాడు. జట్టు మేనేజ్‌మెంట్ అన్ని అంశాలను విశే్లషించి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా ఆ సమావేశంలోనే ఖరారు చేస్తామన్నాడు.
అమీర్ రాక సంతోషకరం
స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలి జైలు శిక్ష, సస్పెన్షన్ వేటును పూర్తి చేసుకున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమని కోహ్లీ అన్నాడు. సమర్థుడైన ఒక యువ బౌలర్ కెరీర్‌ను కొనసాగించడం ఆనందకరమని చెప్పాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తన దృష్టిలో అన్ని మ్యాచ్‌లూ ఒకటేనని, ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశాడు. అమీర్ పునరాగమనం వల్ల పరిస్థితులు మారిపోవని అన్నాడు.
బౌండరీలే చాలు..
తాను భారీ సిక్సర్లు కొట్టలేనని, అందుకే బౌండరీలే కీలకమని కోహ్లీ అన్నాడు. వేగంగా పరుగులు తీయడమే కీలకమని, సిక్సర్లు కొట్టలేకపోతే బౌండరీలతోనే సరిపుచ్చుకుంటానని వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ బలమైన జట్టుగా ఎదిగిందని అన్నాడు. ముస్త్ఫాజుర్ బౌలింగ్ ప్రతిభను అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బంగ్లాదేశ్‌తో పోరు ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు.