క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ పాక్ జట్టులో షర్జీల్, సమీకి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: భారత్‌లో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జట్టును పాకిస్తాన్ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. బాబర్ ఆజమ్, రుమాన్ రరుూస్ గాయాలతో బాధపడుతున్న కారణంగా ఓపెనర్ షర్జీల్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ జట్టులోకి వచ్చారు. అందరూ ముందుగా ఊహించిన విధంగానే, సెలక్టర్లు ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా టి-20 జట్టును ఎంపిక చేశారు. జట్టుకు షహీద్ అఫ్రిదీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, బుధవారం నుంచి బంగ్లాదేశ్‌లో ప్రారంభం కానున్న ఆసియా కప్ చాంపియన్‌షిప్‌లో ఒక్క మార్పుతో ఇదే జట్టు ఆడుతుంది.
పాక్ జట్టు ఇదే
షహీద్ అఫ్రిదీ (కెప్టెన్), మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, సర్ఫ్‌రాజ్ ఖాన్ (వికెట్‌కీపర్), షర్జీల్ ఖాన్, ఇమాద్ వాసిం, అన్వర్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, ఖుర్రం మంజూర్, మహమ్మద్ సమీ, ఇఫ్తికార్ అహ్మద్ (ఆసియా కప్ టోర్నీకి మాత్రమే), ఖలీద్ లతీఫ్ (టి-20 వరల్డ్ కప్ టోర్నీకి మాత్రమే).

గాయాలతో షమీ సతమతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత పేసర్ మహమ్మద్ షమీ గాయాల సమస్యతో సతమతమవుతున్నాడు. కండరాలు బెణకడం, మోకాలి నొప్పి వంటి సమస్యల కారణంగా అతను చాలాకాలంగా భారత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈనెల 24 నుంచి బంగ్లాదేశ్‌లో ప్రారంభం కానున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ఈనెల 24 నుంచి మార్చి ఆరో తేదీ వరకూ జరిగే ఈ టోర్నీని టి-20 వరల్డ్ కప్ పోటీలకు సన్నాహక ఈవెంట్‌గా పేర్కోవాలి. ఆసియా కప్ టోర్నీకి దూరమైన షమీకి టి-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందా అన్నది అనుమానంగానే ఉంది. ఆసియా కప్‌లో షమీ స్థానాన్ని జాతీయ సెలక్టర్లు భువనేశ్వర్ కుమార్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్లలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన షమీ చాలాకాలంగా గాయాలతో బాధపడుతున్న కారణంగా, చాలా మంది పేసర్ల మాదిరిగానే అతని కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగుస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సహజంగానే ఫాస్ట్ బౌలర్ల కెరీర్ తక్కువగా ఉంటుంది. స్పిన్నర్లు చాలాకాలం క్రికెట్‌ను కొనసాగించినా, పేసర్లు తరచు గాయాల బారిన పడుతూ కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టుకుంటారు. శారీరకంగానూ వారు ఎక్కువగా శ్రమపడాలి. అందుకే వారి కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. కపిల్ దేవ్, రిచర్డ్ హాడ్లీ, ఆండీ రాబర్ట్స్ వంటి కొద్ది మంది ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించగలిగారు. మిగతా వారి కెరీర్ తక్కువే. రెండో రకానికి చెందిన పేసర్ల జాబితాలో షమీ కూడా చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. టి-20 వరల్డ్ కప్ ఆరంభం నాటికి కూడా అతను కోలుకోకపోతే, భారత జట్టుకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. అయితే, సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ మాత్రం షమీ త్వరగా ఫిట్నెస్‌ను సంపాదిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అతను బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్తగా అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదని అంటున్నాడు. టి-20 వరల్డ్ కప్‌లో షమీ ఆడతాడని చెప్తున్నాడు.

ఈ ఫార్ములా సీజన్‌లో
వెటెల్ ఫాస్టెస్ట్ టైమింగ్
బార్సిలోనా, ఫిబ్రవరి 23: ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఫార్ములా వన్ సీజన్ టెస్టింగ్ ఓపెనర్‌లో ఫాస్టెస్ట్ టైమింగ్‌ను నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కంటే సుమారు ఒక సెకెను ముందుగా లక్ష్యాన్ని చేరుకొని, ఈ సీజన్‌లో తాను గట్టిపోటీదారుడినన్న సంకేతాలు పంపాడు. నాలుగు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న వెటెల్ గత ఏడాది దారుణంగా విఫలమయ్యాడు. అయితే, తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు టెస్టింగ్ ఓపెనర్‌లో రుజువు చేసుకున్నాడు.

పోటీలో ఉన్న జట్లు
భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ).
షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 24: భారత్/ బంగ్లాదేశ్, ఫిబ్రవరి 25: శ్రీలంక/ యుఎఇ, ఫిబ్రవరి 26: బంగ్లాదేశ్/ యుఎఇ, ఫిబ్రవరి 27: భారత్/ పాకిస్తాన్, ఫిబ్రవరి 28: బంగ్లాదేశ్/ శ్రీలంక, ఫిబ్రవరి 29: పాకిస్తాన్/ యుఎఇ, మార్చి 1: భారత్/ శ్రీలంక, మార్చి 2: బంగ్లాదేశ్/ పాకిస్తాన్, మార్చి 3: భారత్/ యుఎఇ, మార్చి 4: పాకిస్తాన్/ శ్రీలంక, మార్చి 5: ఫైనల్.

ఆసియా కప్ చాంపియన్‌షిప్ వాస్తవానికి 50 ఓవర్ల ఫార్మెట్‌లో జరుగుతుంది. అయితే, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి టోర్నీని టి-20 ఫార్మెట్‌గా మార్చారు.