క్రీడాభూమి

ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న, అతని భాగస్వామి గాబ్రియేలా డబ్రోవ్‌స్కీకి చుక్కెదురైంది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్లుగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్న వీరు మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో హెన్రీ కొంటినెన్ (్ఫన్లాండ్), హీథర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. పదో సీడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న, డబ్రోవ్‌స్కీ సెంటర్ కోర్టులో సరిగ్గా రెండు గంటల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-6 తేడాతో కైవసం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో వెనుకబడిన బొపన్న, డబ్రోవ్‌స్కీ 4-6, 5-7 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో వింబుల్డన్ టోర్నీలో భారత పోరాటం పూర్తిగా ముగిసినట్లయింది. పురుషుల డబుల్స్ ఈవెంట్ నుంచి బొపన్న ఇప్పటికే నిష్క్రమించగా, హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా కూడా అటు మహిళల డబుల్స్‌తో పాటు ఇటు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లలో ఇప్పటికే ఓటమిపాలైన విషయం తెలిసిందే. అలాగే బాలురు, బాలికల విభాగంలో కూడా భారత్‌కు చెందిన మహక్ జైన్, జీల్ దేశాయ్, మిహికా యాదవ్, సిద్ధాంత్ బాంటియా కూడా ఇప్పటికే పరాజయాల పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.