క్రీడాభూమి

ప్రపంచ కప్-2011 ఫైనల్‌లో ఫిక్సింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 14: శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశాడు. 2011ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక జట్టు ఓటమి పాలవడంపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో పరాజయం పాలవడం తనను షాక్‌కు గురి చేసిందని తన ఫేస్‌బుక్ పేజిలో ఉంచిన ఓ వీడియోలో రణతుంగ అన్నాడు. మ్యాచ్ జరిగినప్పుడు తాను కామెంటరీ చేస్తున్నానని, జట్టు ఓడిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని 53 ఏళ్ల రణతుంగ అన్నాడు. అప్పుడే తనకు అనుమానం వచ్చిందని తెలిపిన ఆయన 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంక ఓటమిపై తప్పకుండా విచారణ జరిపించాలని అన్నాడు. అయితే ఇప్పుడే తాను అన్ని విషయాలు బైటికి చెప్పలేనని అంటూ, అయితే ఏదో ఒక రోజున చెప్తానని అన్నాడు. అయితే దీనిపై దర్యాప్తు తప్పకుండా జరగాలన్నాడు. ఆటగాళ్లు తమ తెల్లటి క్రికెట్ దుస్తుల వెనుక మురికిని దాచలేరని కూడా ఆయన అన్నారు. అయితే ఆయన ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు.
ముంబయిలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతేకాక భారత్ ఇన్నింగ్స్‌లో సచిన్ తెండూల్కర్ కేవలం 18 పరుగులకే అవుటయినప్పుడు ఆ జట్టు తిరుగులేని స్థితిలోనే ఉన్నట్లు కనిపించింది. అయితే శ్రీలంక ఫీల్డింగ్, బౌలింగ్ వైఫల్యాలతో భారత్ నాటకీయంగా మ్యాచ్‌ని తనకు అనుకూలంగా మలుచుకొని ఘన విజయం సాధించింది. అప్పట్లో స్థానిక పత్రికలు శ్రీలంక ఆటగాళ్లు చేజేతులా మ్యాచ్‌ని కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి కానీ రణతుంగ బహిరంగంగా కోరే దాకా ఎవరు కూడా దర్యాప్తుకు డిమాండ్ చేయలేదు.
గంభీర్, నెహ్రా దిగ్భ్రాంతి
కాగా, 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై విచారణ జరిపించాలని శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ డిమాండ్ చేయడాన్ని ఆ మ్యాచ్‌లో హీరోలయిన గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు తప్పుబట్టారు. రణతుంగ ఆరోపణలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్న గంభీర్, రణతుంగ తన ఆరోపణలకు సాక్ష్యాధారాలను కూడా చూపించాలని డిమాండ్ చేశాడు. అప్పటి ఫైనల్లో గంభీర్ 97 పరుగులు చేశాడు.రణతుంగ ప్రకటనలను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఆశిష్ నెహ్రా అన్నాడు. కాగా, రణతుంగ ఆరోపణలపై స్పందించడానికి అప్పటి భారత జట్టులో మరో కీలక సభ్యుడైన హర్భజన్ సింగ్ నిరాకరించాడు.