క్రీడాభూమి

అమీతుమీ తేల్చుకునేందుకు ఫెదరర్, సిలిక్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టైటిల్ కోసం ఈసారి స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో పాటు క్రొయేషియాకి చెందిన ఏడో సీడ్ ఆటగాడు మారిన్ సిలిక్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. అమెరికాకు చెందిన 24వ సీడ్ ఆటగాడు శామ్ క్వెరీతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీ ఫైనల్ పోరులో సిలిక్ 6-7(6/8) తేడాతో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడు. పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ఆడిన అతను 6-4, 7-6(7/3), 7-5 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుని శామ్ క్వెరీపై సంచలన విజయం సాధించాడు. వింబుల్డన్‌లో సిలిక్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. 11 ప్రయత్నాల తర్వాత ఈ ఘనత సాధించిన సిలిక్ ఫైనల్‌లో స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తాను ఉత్తమ ప్రదర్శన కనబర్చి అనూహ్య రీతిలో రాణించగలిగానని, అసలు ఈవిధంగా ఆడింది తానేనా? అని ఆశ్చర్యం వేస్తోందని క్వెరీతో పోరు ముగిసిన అనంతరం సిలిక్ తెలిపాడు. మ్యాచ్ ఆరంభంలో, ప్రత్యేకించి తొలి సెట్‌లో క్వెరీ కూడా చక్కగానే రాణించాడని, అయితే ఆ తర్వాత తాను పుంజుకుని అతడిని ఓడించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిలిక్ పేర్కొంటూ, ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ టైటిల్ కోసం ఆదివారం ఫెదరర్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 2014లో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సిలిక్ (28) గతంలో ఏడుసార్లు ఫెదరర్‌తో తలపడి ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించాడు.
కాగా, ఈ టోర్నీలో మూడో సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్ పురుషుల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 7-6(7/4), 7-6(7/4), 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 11వ సీడ్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌ని మట్టికరిపించాడు. వింబుల్డన్‌లో ఫెదరర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 11వ సారి. బెర్డిచ్‌తో ఇప్పటివరకూ 25 సార్లు తలపడిన ఫెదరర్‌కు ఇది 19వ విజయం. దీంతో రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఫెదరర్ మరో అడుగు దూరంలో నిలిచాడు.

చిత్రాలు.. 11వ సారి ఫైనల్‌కు చేరిన రోజర్ ఫెదరర్
*తొలిసారి ఫైనల్‌కు చేరిన మారిన్ సిలిక్