క్రీడాభూమి

ప్రో కబడ్డీ టోర్నమెంట్ ప్రైజ్‌మనీ రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రో కబడ్డీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ప్రైజ్‌మనీని నిర్వాహకులు అమాంతం రెట్టింపు చేశారు. ఐదో ప్రో కబడ్డీ ఈనెల 28న హైదరాబాద్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి ప్రైజ్‌మనీని ఐదు కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు. మొత్తం 138 మ్యాచ్‌లు జరిగే ఈ పోటీల్లో విజేత జట్టుకు మూడు కోట్ల రూపాయలు లభిస్తాయి. రెండో స్థానంలో నిలిచిన జట్టు 1.8 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంటుంది. మూడో స్థానాన్ని సంపాదించిన జట్టుకు 1.2 కోట్ల రూపాయలు లభిస్తాయి. నిరుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా అనూప్ కుమార్, మన్జీత్ చిల్లార్ ఎంపికయ్యారు. ఈసారి ఇదే అవార్డుకు 15 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది.
లండన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్. పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన దేవేంద్ర ఝజేరియా ఈ పోటీలకు దూరంకాగా, అతని స్థానాన్ని సుందర్ సమర్థంగా భర్తీ చేశాడు