క్రీడాభూమి

ఆస్ట్రేలియా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 59 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 48.3 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. బేత్ మూనీ (53), నికోల్ బోల్టన్ (79), ఎలిస్ పెర్రీ (55) అర్ధ శతకాలు సాధించడంతో ఆసీస్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. సనే లస్ 67 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరపున లారా వొల్వార్ట్ (71), త్రిషా చెట్టి (37) తప్ప మిగతా వారు పరుగుల వేటలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసెన్, ఎలిస్ పెర్రీ, రాచెల్ హేన్స్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.
విండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్
బ్రిస్టల్: వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ 92 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 220 పరుగులు చేసింది. టామీ బ్యూవౌంట్ (42), హీతర్ నైట్ (67) బ్యాటింగ్‌లో రాణించారు. చివరిలో జెన్నీ గన్ 29, లారా మార్ష్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అఫీ ఫ్లెచర్ 33 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లు ఆడి, తొమ్మిది వికెట్లకు 128 పరుగులు చేయగలిగింది. హీలీ మాథ్యూస్ (29), చెడియన్ నేషన్ (23) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ నతాలీ సివె నాలుగు ఓవర్లు బౌల్ చేసి, కేవలం మూడు పరుగులకే మూడు వికెట్లు కూల్చడం విశేషం.