క్రీడాభూమి

ఫేవరిట్ ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్‌లో ఇప్పటికే ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్ వన్, వెటరన్ స్టార్ రోజర్ ఫెదరర్ మరోసారి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో ఆదివారం మారిన్ సిలిక్‌తో జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు. వైఫల్యాలను ఎదుర్కొంటున్న ప్రతిసారీ విమర్శలకు గురికావడం, ఆ వెంటనే ఎవరూ ఊహించని రీతిలో చెలరేగి సత్తా చాటడం ఫెదరర్‌కు అలవాటుగా మారింది. ఈసారి వింబుల్డన్‌లోనూ అతను అదే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ వివిధ దశల్లో టోర్నీ నుంచి నిష్క్రమించగా, అందరి దృష్టి ఇప్పుడు ఫెదరర్‌పై ఉంది. ఫైనల్‌లో అతను సిలిక్‌ను ఏ స్థాయిలో నిలువరిస్తాడో చూడాలి. నిజానికి రిటైర్మెంట్ తప్పదేమోనన్న పరిస్థితికి ఎదురీదిన ఫెదరర్ ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 35 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ స్థాయిని నిరూపిస్తూ, ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను చిరకాల ప్రత్యర్థి, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌ను 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో ఓడించాడు. ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకోవడం అది ఐదోసారి. ఇంతకు ముందు అతను 2004, 2006, 2007, 2010 సంవత్సరాల్లో ఈ టైటిల్‌ను సాధించాడు. కాగా, అంతకు ముందు అతనికి చివరిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ 2012లో వింబుల్డన్ రూపంలో లభించింది. ఆతర్వాత టైటిళ్ల కోసం అతను చేసిన పోరాటాలు ఫలించలేదు. ఒకానొక దశలో, వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అతని కెరీర్ ముగిసినట్టేనన్న వార్తలు వచ్చాయి. కానీ, ఆటలో ఆనందాన్ని పొందుతున్నంత కాలం రిటైర్మెంట్ ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫెదరర్ తేల్చిచెప్పాడు. టైటిళ్లను సాధించే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఆ మాటలను ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించి, నిజం చేశాడు. అయతే, ఈ ఏడాది రెండో గ్రాండ్ శ్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌కు అతను హాజరుకాలేదు. ఫిట్నెస్‌ను కాపాడుకోవడంతోపాటు, గ్రాస్ కోర్టులపై నైపుణ్యాన్ని కొనసాగించడానికి వీలుగా తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో అతను ప్రకటించాడు. ఇలావుంటే, ఐదు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లతోపాటు ఫెదరర్ ఖాతాలో ఒక ఫ్రెంచ్ ఓపెన్ (2009), ఏడు వింబుల్డన్ (2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012), ఐదు యుఎస్ ఓపెన్ (2004, 2005, 2006, 2007, 2008) టైటిళ్లు ఉన్నాయి. మరో టైటిల్‌ను గెల్చుకొని, తన సమీపానికి కూడా ఎవరూ రాకుండా చూడాలన్నదే ఫెదరర్ లక్ష్యంగా కనిపిస్తున్నది. మారిన్ సిలిక్‌తో ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్‌లో అతను ఫేవరి ట్‌గా బరిలోకి దిగుతున్నాడు. సిలిక్‌ను త క్కువ అంచనా వేయలేకపోయనా, ఫెదర ర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

చిత్రం.. రోజర్ ఫెదరర్