క్రీడాభూమి

ఆంధ్ర ప్రదేశ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 15: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో శనివారం ప్రారంభమైన 57వ జాతీయ సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రెండు పతకాలు సాధించి శుభారంభం చేశారు. 400 మీటర్ల హర్డిల్స్ పురుషుల విభాగంలో ఎంపీ జబీర్, ఎం రామచంద్రన్ ఇద్దరూ వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు బోణీ కొట్టారు. తరువాతి స్థానంలో తమిళనాడుకు చెందిన సంతోష్‌కుమార్ నిలిచాడు. ఇదే కేటగిరీ మహిళల విభాగంలో కేరళకు చెందిన అనురాఘవన్ కొత్త మీట్ రికార్డును నమోదుచేసి (2014లో ఏసీ అశ్వినీ లక్నోలో నమోదు చేసిన మీట్ రికార్డును అధిగమించింది) ప్రథమ స్థానంలో నిలవగా, జానూ ముర్మూ (ఒడిషా), సరితా గైక్వాడ్ (గుజరాత్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. కాగా 200 మీటర్ల పరుగులో గుండు వంశీప్రవీణ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. 5వేల మీటర్ల రన్ పురుషుల విభాగంలో జి లక్ష్మణన్ (తమిళనాడు- 14:07:76 నిమిషాలు), మాన్‌సింగ్ (ఉత్తరాఖండ్- 14:20:50 నిమిషాలు), కాళిదాస్ హిరావే (మహారాష్ట్ర- 14:20:91 నిమిషాలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఎల్ సూర్య (తమిళనాడు- 15:46:92ని.), సంజీవని బబూర్ యాదవ్ (ఏఎఫ్‌ఐ- 16:35:64ని.), ప్రీనూ యాదవ్ (్ఢల్లీ- 16:56:60ని.) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. 800 మీటర్ల రన్ మహిళల విభాగంలో డియోరే దుర్గా (మహారాష్ట్ర), శయాలీ (మహారాష్ట్ర), లిలీదాస్ (పశ్చిమ బెంగాల్), కోమల్ చౌదరి (హరియాణా), అభితా మేరీ (కేరళ), విజయకుమారి (కర్ణాటక), ప్రియ (తమిళనాడు), సిప్రా సర్కార్ (పశ్చిమ బెంగాల్) హీట్స్‌లో అర్హత సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. 800 మీటర్ల రన్ పురుషుల విభాగంలో రఘురామ్ (తమిళనాడు), చరణ్‌జీత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), మణిదీప్ (గుజరాత్), మంజిత్ సింగ్ (హరియాణా), ఏఎస్ ఇర్షాద్ (కేరళ), విశ్వంబేశ్వర్ (కర్ణాటక), జాన్సన్ (కేరళ), రాజేంద్ర సింగ్ (్ఢల్లీ) ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల షాట్‌పుట్ ఫైనల్‌లో మన్‌ప్రీత్ కౌర్ (హరియాణా- 15.65 మీటర్లు), అనామికాదాస్ (ఉత్తరప్రదేశ్- 14.42 మీటర్లు), రమణ్ ప్రీత్‌కౌర్ (పంజాబ్- 14.25 మీటర్లు) వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. హైజంప్ మహిళల విభాగంలో గాయత్రి శివకుమార్ (కేరళ- 1.79 మీటర్లు), లైవాన్‌నర్‌జారే (అసోం- 1.76 మీటర్లు), జినూ మరియా మనూయేల్ (కేరళ- 1.73 మీటర్లు) వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.