క్రీడాభూమి

తెలుగు అథ్లెట్లు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 16: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో జరుగుతున్న 57వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండోరోజు ఆదివారం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ అథ్లెట్లు విజయాలకు ఆమడదూరంలో నిలిచిపోయారు. తొలిరోజు పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రెండోరోజు పతకాల వేటలో వెనుకబడ్డారు. 20 కి.మీల వాక్‌లో హరియాణాకు చెందిన సందీప్ కుమార్ గంటా 27 నిమిషాల 1:52 సెకన్లు నడిచి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన జితేంద్ర సింగ్ గంటా 27 నిమిషాల 4:32 సెకన్లు నడిచి రజతం, పంజాబ్‌కు చెందిన బల్జీందర్ సింగ్ గంటా 29 నిమిషాల 38:72 సెకన్లు నడిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 200 మీటర్ల పురుష, మహిళల విభాగాల్లో ఒడిశా అథ్లెట్లే స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో ఒడిశాకు చెందిన అమియాకుమార్ మల్లిక్ 21.65 సెకన్ల వ్యవధితో స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, మణిపూర్‌కు చెందిన విపిన్‌కుమార్ 21.85 సెకన్లలో రజతం, హరియాణాకు చెందిన పర్వీణ్ 22.01 సెకన్లలో కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఒడిశాకే చెందిన శ్రబానీనంద 24.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది. పశ్చిమబంగాకు చెందిన అనే్వషరాయ్ ప్రధాన్ 24:37 సెకన్లు, సోనియా బైస్యా 24.85 సెకన్లతో వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. 800 మీటర్ల మహిళల పరుగులో పశ్చిమబంగాకు చెందిన లిలీదాస్ 2 నిమిషాల 03:46 సెకన్లతో స్వర్ణ పతకం సాధించింది. కేరళకు చెందిన అబితా మేరీమానుయేల్ 2 నిమిషాల 6:19 సెకన్లతో రజత పతకం, పశ్చిమబంగాకు చెందిన సిప్రాసర్కార్ 2 నిమిషాల 7:48 సెకన్లలో పరిగెట్టి కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల విభాగంలో కేరళకు చెందిన జిన్స్ జాన్సన్ ఒక నిమిషం 47:38 సెకన్లలో లక్ష్యాన్ని సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. హరియాణాకు చెందిన మంజిత్ సింగ్ నిమిషం 48:04 సెకన్లలో, కర్ణాటకకు చెందిన విశ్వంభర్ నిమిషం 48:64 సెకన్లలో వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. లాంగ్ జంప్ పురుషుల విభాగంలో కేరళకు చెందిన మహ్మద్ అనీషీ 7.60 మీటర్లు దూకి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. కేరళకు చెందిన పీవీ సోహేల్ 7.55 మీటర్లు, కర్ణాటకకు చెందిన సిద్ధాంత్ నాయక్ 7.41 మీటర్ల దూరం జంప్ చేసి వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. షాట్‌పుట్ పురుషుల విభాగంలో పంజాబ్‌కే చెందిన జితేంద్ర సింగ్ (19.46 మీటర్లు), జస్‌దీప్ సింగ్ (18.48 మీటర్లు), నవతేజ్‌దీప్ సింగ్ (17.61 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి కండబలాన్ని చాటారు. పురుషుల జావలిన్‌త్రోలో పంజాబ్‌కు చెందిన దేవేంద్ర సింగ్ 81.84 మీటర్లతో సరికొత్త మీట్ రికార్డును నమోదు చేశాడు. గతంలో 2000 సంవత్సరంలో జగదీష్ పేరుతో ఉన్న 79.67 మీటర్ల రికార్డును బద్దలుకొట్టాడు. పంజాబ్‌కు చెందిన రవీంద్ర సింగ్ 74.71 మీటర్లతో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌కుమార్ 74.43 మీటర్లతో వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.