క్రీడాభూమి

ఎన్నో రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ 2012 తర్వాత తిరిగి వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. మొత్తం మీద ఇక్కడ అతను టైటిల్ సాధించడం ఇది ఎనిమిదో సారి. ఇంతకు ముందు అతను 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012 సంవత్సరాల్లో వింబుల్డన్ టైటిల్ అందుకున్నాడు. కాగా, అతని ఖాతాలో ఐదు ఆస్ట్రేలియా ఓపెన్ (2004, 2006, 2007, 2010, 2017), ఒక ఫ్రెంచ్ ఓపెన్ (2009), ఐదు యుఎస్ ఓపెన్ (2004, 2005, 2006, 2007, 2008) టైటిళ్లు ఉన్నాయి. మొత్తం 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో అతను ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు.
* కెరీర్‌లో రెండసారి ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన సిలిక్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2014లో అతను తొలిసారి యుఎస్ ఓపెన్ లో ఫైనల్ చేరాడు. కెయ్ నిషికొరీని 6-3, 6-3, 6-3 తేడాతో ఓడించి టైటిల్ అందుకున్నాడు. అంతకు ముందు, ఆతర్వాత అతను గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్ చేరలేకపోయాడు. ఈసారి వింబుల్డన్‌లో హేమాహేమీలు మట్టికరవడంతో, సిలిక్ టైటిల్ పోరు వరకూ వచ్చాడు. అయితే, ఫెదరర్ వంటి అపార అనుభవం ఉన్న గొప్ప స్టార్‌ను సమర్థంగా ఎదుర్కోలేక, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు.
కాగా, ఈ విజయంతో ఫెదరర్‌కు 22,00,000 పౌండ్లు (సుమారు 18.51 కోట్ల రూపాయలు) గెల్చుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన సిలిక్ 11,00,000 పౌండ్లు (సుమారు 9.26 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుకున్నాడు.

చిత్రాలు..మారిన్ సిలిక్‌ను ఓడించిన రోజర్ ఫెదరర్ ఆనందం * మారిన్ సిలిక్