క్రీడాభూమి

తప్పు చేశా.. క్షమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: తాను పొరపాటు చేశానని, ఒక జట్టుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడం తప్పేనని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అంగీకరించాడు. తనను క్షమించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి విజ్ఞప్తి చేశాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కేన్ విలియమ్‌సన్ ఎల్‌బి అయ్యాడంటూ ఆస్ట్రేలియా ఫీల్డర్లు చేసిన అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ తోసిపుచ్చడంతో స్మిత్ తీవ్రంగా స్పందించాడు. ఏఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నాటౌట్ అంటూ నిర్ణయాన్ని ప్రకటించారంటూ మండిపడ్డాడు. అంపైర్ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, స్పిత్ వైఖరిపై ఫీల్డ్ అంపైర్లు కెటిల్‌బరో, మార్టినెజ్ ఐసిసికి ఫిర్యాదు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన స్మిత్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. తన ప్రవర్తన ఏమాత్రం సమర్థనీయం కాదన్నాడు. తన వల్ల పొరపాటు జరిగిందని అంగీకరించాడు. క్షమించాలని కోరాడు. ఇలావుంటే, ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్ కూడా అంపైర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాడు. ఆ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న ఐసిసి అతనిని మందలించడమేగాక,మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని జరిమానాగా విధించింది.