క్రీడాభూమి

చెలరేగిన కులకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె: రంజీ ట్రోఫీ ఫైనల్ మొదటి రోజు సౌరాష్టప్రై ముంబయి జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. చెలరేగిపోయిన ముంబయి సీనియర్ పేసర్ ధవళ్ కులకర్ణి 30 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, సౌరాష్టన్రు దారుణంగా దెబ్బతీశాడు. శార్దూల్ ఠాకూర్ 59 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. బల్వీందర్ సంధు, అభిషేక్ నాయర్ చెరొక వికెట్ పంచుకున్నారు.

టైటాన్స్‌కు ఆరో విజయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రో కబడ్డీలో తెలుగు టై టాన్స్ జట్టు ఆరో విజయాన్ని సాధించింది. బుధ వారం దబాంగ్ ఢిల్లీతో తలపడిన టైటాన్స్ 44-35 తేడాతో విజయం సాధించింది. రాహుల్ చౌదరి అ సాధారణ ప్రతిభ కనబరచి, 17 పాయంట్లు సంపా దించడంతో టైటాన్స్ విజయం సులభతరమైంది. 11వ మ్యాచ్ ఆడిన టైటాన్స్‌కు ఇది ఆరో విజయం కాగా, దబాంగ్ ఢిల్లీకి ఇది తొమ్మిదో పరాజయం. టైటాన్స్ జట్టు మొత్తం 33 పాయంట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. పాట్నా పైరే ట్స్ 52, బెంగాల్ వారియర్స్ 37, యు ముంబా 35 పాయంట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయ

సానియా, హింగిస్ ఖాతాలో
మరో వరుస విజయం
దోహా, ఫిబ్రవరి 24: మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ విజయపరంపరలను కొనసాగిస్తున్నది. మరో మ్యాచ్‌లో గెలవడం ద్వారా వరుసగా 41వ విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ జరుగుతున్న కతార్ ఓపెర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఇ ఫాన్ జూ, సైసై జెంగ్ జోడీని 6-4, 4-6, 10-4 తేడాతో ఓడించిన సానియా, హింగిస్ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. జానా నవోత్న, హెలెనా సుకోవా 44 వరుస విజయాలతో నెలకొల్పిన రికార్డును అందుకోవడానికి వీరు మూడు విజయాల దూరంలో ఉన్నారు. ఈ టోర్నీలో గెలిస్తే, వీరు 44 విజయాల రికార్డును సమం చేస్తారు.

దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
స్టెల్లెన్‌బాచ్, ఫిబ్రవరి 24: భారత అండర్-21 మహి ళల హాకీలో దక్షిణాఫ్రికాపై భారత జట్టు వరుసగా రెం డు విజయాలను నమోదు చేసింది. మొదటి మ్యాచ్ లో ఈ జట్టు 3-1 తేడాతో పటిష్టమైన ప్రత్యర్థిని ఓడిం చింది. రెండో మ్యాచ్‌లో ఆరంభం నుంచే దాడులకు దిగిన భారత మహిళలు గోల్స్ వరద పారించారు. ద క్షిణాఫ్రికా రక్షణ వలయాన్ని సులభంగానే ఛేదించిన వీరు మ్యాచ్‌ని 8-0 తేడాతో తన ఖాతాలో వేసుకున్నా రు. భారత అటాకింగ్‌కు దక్షిణాఫ్రికా నుంచి ఏ దశ లోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. ఒకదాని తర్వాత మరొకటిగా గోల్స్ నమోదవుతుండగా, దక్షిణాఫ్రికా క్రీ డాకారిణులు ప్రేక్షక పాత్ర పోషించారు. కాగా తర్వాతి మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను భారత్ ఢీ కొంటుంది.