క్రీడాభూమి

భారత్‌ను ఓడించిన సిరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, జూలై 20: ఫుట్‌బాల్ అండర్-23 ఎఎఫ్‌సి క్వాలిఫయర్స్‌లో భారత్‌కు మొదటి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. సిరియాను ఢీకొని, 0-2 తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆట ఆరంభం నుంచి ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ చాలాసేపు ఇదే తరహా ఆటతో ఇరు జట్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. 64వ నిమిషంలో రబీ స్రోర్ చేసిన గోల్‌తో సిరియా ఖాతా తెరిచింది. 88 నిమిషంలో ఫారెస్ ఆర్నాట్ ద్వారా ఆ జట్టుకు రెండో గోల్ లభించింది. భారత ఆటగాళ్లు అనిరుద్ధ్ థాపా, నిషూ కుమార్, మాన్వీర్ సింగ్ గోల్ చేసే అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
భారత్ ‘ఎ’ ఫీల్డింగ్ కోచ్‌గా విజయ్ యాదవ్
న్యూఢిల్లీ, జూలై 20: భారత్ ‘ఎ’ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ వికెట్‌కీపర్ విజయ్ యాదవ్‌ను నియమించారు. దక్షిణాఫ్రికాకు వెళ్లే భారత్ ‘ఎ’కు అతను సేవలు అందిస్తాడు. ఈ నియామకాన్ని విజయ్ స్వయంగా పిటిఐకి వెళ్లడించాడు. తనకు కొన్ని గంటల ముందే ఈ వార్త తెలిసిందని అన్నాడు. శనివారం జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుందని, అయితే, తాను మరో రెండు రోజుల తర్వాత జట్టును కలుస్తానని తెలిపాడు. తాను ఇంకా వీసా తీసుకోలేదని, అది పొందిన తర్వాత దక్షిణాఫ్రికా వెళతానని వివరించాడు. విజయ్ కెరీర్‌లో ఒక టెస్టు, 19 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు.