క్రీడాభూమి

కివీస్‌పై రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి, రెండో టెస్టులోనూ విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. గెలవడానికి 201 పరుగులు చేయాల్సి ఉండగా, ఒక వికెట్ నష్టానికి 70 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన బుధవారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. జో బర్న్స్ 65, డేవిడ్ వార్నర్ 22, ఉస్మాన్ ఖాజా 45 చొప్పున పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివరిలో స్టివెన్ స్మిత్ (53), ఆడం వోగ్స్ (10) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ ఆడి, జట్టుకు విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా 54 ఓవర్లలో మూడు వికెట్లకు 201 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో ఆలౌట్ 370 ఆలౌట్ (బ్రెండన్ మెక్‌కలమ్ 145, కోరీ ఆండర్సన్ 72, వాట్లింగ్ 58, నాథన్ లియాన్ 3/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 363): 153.1 ఓవర్లలో 505 ఆలౌట్ (జో బర్న్స్ 170, స్టీవెన్ స్మిత్ 138, ఆడం వోగ్స్ 60, నాథన్ లియాన్ 33, నీల్ వాగ్నర్ 6/106, ట్రెంట్ బౌల్ట్ 2/108).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 111.1 ఓవర్లలో 335 ఆలౌట్ (లాథమ్ 39, కేన్ విలియమ్‌సన్ 97, వాల్టింగ్ 46, హెన్రీ 66, జేమ్స్ పాటిన్సన్ 4/277, బర్డ్ 5/59).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 70): 54 ఓవర్లలో 3 వికెట్లకు 201 (జో బర్న్స్ 65, డేవిడ్ వార్నర్ 22, ఉస్మాన్ ఖాజా 45, స్టీవెన్ స్మిత్ 53 నాటౌట్, ఆడం వోగ్స్ 10 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 1/60, టిమ్ సౌథీ 1/30, నీల్ వాగ్నర్ 1/60).