క్రీడాభూమి

క్రికెట్‌కు లంబ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 20: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మైఖేల్ లంబ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాలి మడమ గాయం కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 37 ఏళ్ల లంబ్ ఇటీవల రెండు టి-20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ సమయంలో కాలి మడమకు బలమైన గాయం తగిలింది. ఇకపై కెరీర్‌ను కొనసాగించే అవకాశం లేదని వైద్యులు ప్రకటించడంతో, కెరీర్‌ను ముగిస్తున్నట్టు లంబ్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన లంబ్ ఇంగ్లాండ్ తరఫున మూడు వనే్డలు, 27 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వనే్డల్లో 165 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 106 పరుగులు. టి-20లో అతను 552 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 63 పరుగులు. ఫస్ట్‌క్లాస్ విభాగంలో 210 మ్యాచ్‌ల్లో, 11,443 పరుగులు సాధించాడు.

చిత్రం.. మైఖేల్ లంబ్