క్రీడాభూమి

ఒత్తిడి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 20: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఒత్తిడి లేకుండా ఆడాలని సహచరులకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. లంకతో జరిగే మొదటి టెస్టులో లోకేష్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం శిఖర్ ధావన్ లేదా అభినవ్ ముకుంద్‌లో ఎవరికి వచ్చినా ఒత్తిడి లేకుండా ఆడాలని శ్రీలంక కోచ్ నిక్ పొటాస్, కెప్టెన్ ఉపుల్ తరంగ, భారత కోచ్ రవి శాస్ర్తీతో కలిసి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ అన్నాడు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం దురదృష్టకరమని అన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ గొప్పగా సేవలు అందించాలనే వస్తారని, క్రీడల్లో గాయాలు దురదృష్టకరమైన భాగమని వ్యాఖ్యానించాడు. చాలా మంది క్రికెటర్లకు తమ ఫిట్నెస్‌పై స్పష్టత ఉండడం, దాని గురించి ఎలాంటి భేజాలు లేకుండా వాస్తవాలను వెల్లడించడం మంచి లక్షణమని అన్నాడు. పూర్తి ఫిట్నెస్‌తో లేనన్న విషయాన్ని సెలక్టర్లకు మురళీ విజయ్ స్వయంగా తెలియచేశాడని, జట్టులో ఇలాంటి ఉత్తమ సంస్కృతి ఉందని చెప్పాడు. లంకతో ధర్మశాలలో టెస్టు ఆడినప్పుడు చటేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయాన్ని కోహ్లీ గుర్తుచేశాడు. జట్టుకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అన్నాడు. లంక అన్ని విధాలుగానూ పటిష్టంగా ఉందని పేర్కొంటూ, పోరు ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు.

చిత్రం.. శ్రీలంక కోచ్ నిక్ పొటాస్, కెప్టెన్ ఉపుల్ తరంగ, భారత కోచ్ రవి శాస్ర్తీతో కలిసి
కొలంబోలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ