క్రీడాభూమి

హర్మన్‌ప్రీత్ వీరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 20: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్ ఫై నల్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వీరవిహారం భా రత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ విజృంభణ అభిమానులను ఆక ట్టుకుంది. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆసీస్‌పై నా కౌట్ దశలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన ఆమె అజేయంగా 171 పరుగులు చే యడం విశేషం. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లకు 281 పరుగులు సాధిం చగా, ఆసీస్ 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి, 2005 తర్వాత రెం డోసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరింది.
భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరు పరుగుల స్కోరువద్ద మెగాన్ షట్ బౌలింగ్‌లో ఎలైస్ విలానీ క్యాచ్ పట్టడంతో స్మృతి మందానా వెనుదిరిగింది. మరో ఓపెనర్ పూనమ్ రావత్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయింది. ఆమె 14 పరుగులు చేసి, ఆష్లే గార్డ్‌నర్ బౌలింగ్‌లో బెత్ మూనీకి చిక్కింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆసీస్ బౌలింగ్‌ను ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటూ, జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించారు. 61 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 36 పరుగులు సాధించిన మిథాలీని క్రిస్టెన్ బీమ్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో, 101 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ చేజార్చుకుంది. అప్పటికే క్రీజ్‌లో నిలదొక్కుకున్న హర్మన్‌ప్రీత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కింది. దీప్తి శర్మ 35 బంతుల్లో 25 పరుగులు చేసి ఎలైస్ విలానీ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వేదా కృష్ణమూర్తి (16 నాటౌట్)తో కలిసి మరో వికెట్ కూలకుండా, నిర్ణీత 42 ఓవర్లను పూర్తి చేసిన హర్మన్‌ప్రీత్ కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు సాధించింది. ఆమె స్కోరులో 20 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
భారత్‌ను ఓడించి ఫైనల్ చేరేందుకు 282 పరుగులు సాధించాల్సి ఉండగా, నాలుగు పరుగుల వద్ద మొదటి వికెట్‌గా బెత్ రూనీ (1) వెనుదిరిగింది. శిఖా పాండే ఆమెను క్లీన్ బౌల్డ్ చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగు ల ఖాతా తెరవకుండానే, ఝూలన్ గోస్వామి బౌలింగ్ లో అవుటైంది. ఓపెనర్ నికోల్ బోల్టన్ (14)ను దీప్తి శర్మ రిటర్న్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపింది. ఈ దశలో ఎలిస్ విలానీ, ఎలిస్ పెర్రీ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 105 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. 58 బంతుల్లో, 13 ఫోర్ల తో 75 పరుగులు చేసిన విలానీని స్మృతి మందానా క్యాచ్ పట్టగా రాజేశ్వరి గైక్వాడ్ అవుట్ చేయడంతో ఈ భాగ స్వామ్యానికి తెరపడింది. ఎలైస్ పెర్రీ ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయంది. 56 బంతుల్లో 38 పరు గులు చేసిన ఆమె శిఖా పాండే బౌలింగ్‌లో సుష్మా వర్మ కు క్యాచ్ ఇచ్చి అవుటైంది. జట్టును ఆదుకుంటుందని అ నుకున్న అలిసా హీలీ కేవలం ఐదు పరుగులకే వెనుదిరి గింది. శిఖా పాండే క్యాచ్ పట్టడంతో ఝూలన్ గోస్వా మి ఆమె వికెట్ సాధించింది. 148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయన ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయం ది. ఆష్లే గార్డ్‌నర్ ఒక పరుగు మాత్రమే చేసి, మిథాలీ క్యా చ్ పట్టగా పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటైంది. జెస్ జొనాసెన్ కూడా ఒక పరుగు చేసి రనౌటైంది. 154 పరు గుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోవడంతో, భారత్ విజయం ఖాయమైంది. దీప్తి శర్మ బౌలింగ్‌లో ఝూలన్ గోస్వామికి చిక్కిన మెగాన్ షట్ (2) పెవిలియన్ చేరగా, 9 వికెట్లకు ఆసీస్ 169 పరుగులు చేయగలిగింది. అప్పటి ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ, చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్నందున ఆసీస్ ఓటమి అంచున నిలిచింది. చివరిలో క్రిస్టెన్ బీమ్స్ సహకారంతో ఎలెక్స్ బ్లాక్‌వెల్ వీ రోచితంగా పోరాడింది.. 56 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 90 పరుగులు చేసిన ఆమెను దీప్తి శర్మ బౌల్డ్ చేయడంతో 40.1 ఓవర్లలో 245 పరుగు ల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. బీమ్స్ 11 పరుగుల తో నాటౌట్‌గా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 42 ఓవర్లలో 4 వికెట్లకు 281 (మిథాలీ రాజ్ 36, హర్మన్‌ప్రీత్ కౌర్ 171 నాటౌట్, దీప్తి శర్మ 25, వేదా కృష్ణమూర్తి 16 నాటౌట్, మెగాన్ షట్ 1/58, ఆష్లే గార్డ్‌నర్ 1/43, క్రిస్టెన్ బీమ్స్ 1/49, ఎలైస్ విలానీ 1/19).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 40.1 ఓవర్లలో 245 ఆలౌట్ ( పెర్రీ 38, ఎలిస్ విలానీ 75, అలెక్స్ బ్లాక్‌వెల్ 90, దీప్తి శర్మ 3/59, ఝూలన్ గోస్వామి 2/35, శిఖా పాండే 2/17).

చిత్రం.. సెంచరీ స్టార్ హర్మన్‌ప్రీత్ కౌర్