క్రీడాభూమి

మహిళల క్రికెట్ లంకపై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: మహిళల క్రికెట్‌లో శ్రీలంకను రెండో టి-20 మ్యాచ్‌లో ఢీకొన్న భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసింది. దిలానీ మనోదరా 27 పరుగులు చేయగా, భారత బౌలర్ పూనమ్ యాదవ్ 17 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19 ఓవర్లలో 5 వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. ఒకానొక దశలో మిడిల్ ఆర్డర్ విఫలమై భారత్ సమస్యల్లో పడింది. అయితే, కెప్టెన్ మిథాలీ రాజ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ జట్టును గెలిపించింది. ఆమె అజేయంగా 51 పరుగులు చేసి, జట్టును ఆదుకుంది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రనవీర 10 పరుగులకే మూడు వికెట్లు సాధించడం విశేషం.

నంబర్ వన్ ఆస్ట్రేలియా: న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌ని గెల్చుకోవడం ద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు. ఈ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ర్యాంకింగ్స్‌కు కటాఫ్ తేదీ ముగిసే సమయంలోనే ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానానికి చేరడం విశేషం. భారత్ రెండో స్థానంలో ఉంది.
రిటైర్మెంట్‌పై
అఫ్రిదీ పునరాలోచన!
మీర్పూర్, ఫిబ్రవరి 24: పాకిస్తాన్ టి-20 కె ప్టెన్, ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ తన రిటైర్మెం ట్‌పై మనసు మార్చుకునే అవకాశాలు కనిపిస్తు న్నాయ. టి-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు గు డ్‌బై చెప్తానని ఇంతకు ముందే ప్రకటించిన అ ఫ్రిదీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. రిరైర్ కావద్దంటూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నద ని, అందుకే మరోసారి తన నిర్ణయంపై ఆలోచి స్తానని అఫ్రిదీ తెలిపాడు.

కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు
భారత మాజీ కెప్టెన్ శ్రీకాంత్
ముంబయి, ఫిబ్రవరి 24: భారత జట్టుకు విరాట్ కోహ్లీ భవిష్యత్తులో గొప్ప కెప్టెన్ అవుతాడని, అత్యుత్తమ సేవలు అందిస్తాడని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్తకొత్త విధానాలను అమలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కాబట్టి కోహ్లీ మిగతా వారి కంటే భిన్నంగా కనిపిస్తాడని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ అన్నాడు. చివరి క్షణం వరకూ పోరాడే తత్వం కూడా కోహ్లీకి ఉందని ప్రశంసించాడు. ఒక జట్టును ముందుకు నడిపించే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు అత్యవసరమని చెప్పాడు. మైదానంలో దూకుడుగా ఉంటూ, సత్వర నిర్ణయాలను తీసుకునే నాయకుడినే అందరూ గౌరవిస్తారని అన్నాడు. కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ సంపూర్ణ వ్యక్తిత్వంతో జట్టును నడిపించాడని గుర్తు చేసుకున్నాడు. ఆతర్వాత నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన కపిల్ దేవ్ అనుసరించిన విధానం గవాస్కర్‌కు పూర్తి భిన్నమని అన్నాడు. ఎవరి ఆలోచనా విధానం వారిదని, ఇద్దరూ జట్టుకు ఉత్తమ సేవలు అందించారని కితాబునిచ్చాడు.