క్రీడాభూమి

మొగాలో పండుగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 21: పంజాబ్‌లోని మొగా గ్రామంలో ఎవరూ అనుకోని, ముందుగా ఊహించని పండుగ సందడి చేసింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో వీరవిహారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్వగ్రామం కావడంతో, మొగా మొత్తం పండగ చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అభిమానులు హర్మన్‌ప్రీత్ ఇంటికి వెల్లువెత్తి, ఆమె తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులను అభినందించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం పంచుకున్నారు. వీరేందర్ సెవాగ్ మాదిరి బ్యాటింగ్ చేయడం, మైదానంలో విరాట్ కోహ్లీలా దూకుడుగా ఉండడం హర్మన్‌ప్రీత్‌కు చాలా ఇష్టమని ఆమె సోదరి హేంజిత్ కౌర్ పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. చిన్నతనం నుంచి అబ్బాయిలతో కలిసి హర్మన్‌ప్రీత్ క్రికెట్ ఆడేదని తెలిపింది. బ్యాటింగ్‌లో సెవాగ్‌ను స్ఫూర్తిగా ఎంచుకొని, అతని మాదిరే ఆడడం ప్రాక్టీస్ చేసేదని చెప్పింది. 1983 వరల్డ్ కప్‌లో కపిల్ దేవ్ 175 పరుగులు సాధించి, జింబాబ్వేపై భారత్‌ను గెలిపించిన విధంగానే తన సోదరి గురువారం నాటి సెమీ ఫైనల్‌లో అజేయంగా 171 పరుగులు చేసి, ఆసీస్‌పై భారత్‌కు విజయాన్ని అందించిందని అన్నది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ టైటిల్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. హర్మన్‌ప్రీత్‌కు తన తండ్రి హర్మందర్ సింగ్ క్రికెట్‌లో తొలి పాఠాలు నేర్పాడని, అతని ప్రోత్సాహంతోనే ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఆడగలుగుతున్నదని హేంజిత్ తెలిపింది. ఇలావుంటే, మొగా గ్రామంలో చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా అంతా సంబరాలు జరుపుకొన్నారు. వాద్య సంగీతాలు, నృత్యాలతో మొగా మారుమోగింది.

చిత్రం.. హర్మన్‌ప్రీత్ కౌర్ కుటుంబ సభ్యులు