క్రీడాభూమి

హర్మన్‌ప్రీత్‌పై ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అటు ప్రముఖులు, ఇటు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో 115 బంతుల్లోనే 171 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్ 2005 తర్వాత భారత్‌ను మరోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చింది. ఓపెనర్లు స్మృతి మందానా, పూనమ్ రావత్ విఫలమైనప్పటికీ, హర్మన్‌ప్రీత్ జట్టుకు అండగా నిలిచింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. మిథాలీ 36 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుట్ కావడంతో, హర్మన్‌ప్రీత్ దూకుడుకు తెరపడుతుందని అంతా అనుమానించారు. కానీ, దీప్తి శర్మ సాయంతో ఆమె శతకాన్ని పూర్తి చేసింది. తర్వాత కూడా విజృంభణ కొనసాగించింది. ఆమె 171 పరుగుల్లో 20 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయంటే, బ్యాటింగ్ చేసిన తీరును ఊహించుకోవచ్చు. మొత్తం మీద హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ నైపుణ్యం భారత్‌ను గెలిపించింది. ప రుగుల వేటలో తడబడిన ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో ఓడడంలో ఆమె మెరుపు సెంచరీ ప్రధాన భూమిక పోషించింది. ఆ ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఆమె బ్యాటింగ్ ప్రతిభను వేనోళ్ల పొగుడుతున్నారు. వార్తా పత్రికలు, చానెళ్లలో ఆమె బ్యాటింగ్‌ను గురించి విశే్లషణలే. విధ్వంసకర బ్యాటింగ్ అంటే ఏమిటో హర్మన్‌ప్రీత్ కళ్లకు కట్టినట్టు చూపిందని పదో ఐపిఎల్‌లో కెప్టెన్‌గా ముంబయి ఇండియన్స్‌కు టైటిల్‌ను అందించిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఆమె ఇన్నింగ్స్ మ్యాచ్‌ని గెలిపించిందని పేర్కొన్నాడు. దేశానికి హర్మన్‌ప్రీత్ ఒక అద్భుత విజయాన్ని సాధించిపెట్టిందని, భారతీయులంతగా గర్వంతో ఉప్పొంగేలా చేసిందని మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ప్రశంసించాడు. ఆమె ఆటను వర్ణించడానికి మాటలు చాలవని అన్నాడు. టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవి శాస్ర్తీ కూడా హర్మన్‌ప్రీత్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమెను రాక్‌స్టార్‌గా అభివర్ణించాడు. ఆమె బ్యాటింగ్ చేసిన తీరు అనన్య సామాన్యమని కొనియాడాడు. హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిందని ఆమె స్వస్థలమైన పంజాబ్‌కే చెందిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ఆమె వల్లే భారత్‌కు ఫైనల్‌లో చోటు దక్కిందని కొనియాడాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక ప్రకటనలో హర్మన్‌ప్రీత్‌ను పోరాట యోధురాలిగా పేర్కొన్నాడు. వీరితోపాటు పలువురు మాజీ, ప్రస్తు త క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు హర్మన్‌ప్రీత్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

చిత్రం.. హర్మన్‌ప్రీత్ కౌర్