క్రీడాభూమి

రోహిత్‌కు జాక్‌పాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జాక్‌పాట్ కొట్టాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) జరిపిన జూన్ మాసం నాటి చెల్లింపుల్లో అతనిదే అత్యధిక వాటా. కాంట్రాక్టులో ఉన్న పలువురు ఆటగాళ్లతోపాటు, రాష్ట్ర,విదేశీ క్రికెట్ బోర్డులు, ఐపిఎల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీలకు ఎంతెంత మొత్తాన్ని విడుదల చేసిందనే వివరాలను బిసిసిఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం రోహిత్‌కు అత్యధికంగా 1.12 కోట్ల రూపాయలు లభిచాయి. భుజం గాయం కారణంగా కొన్ని సిరీస్‌లకు దూరమైనప్పటికీ రోహిత్‌కే భారీ మొత్తం దక్కడం విశేషం. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన చివరి టెస్టుకు నాయకత్వం వహించిన అజింక్య రహానేకు 1.10 కోట్ల రూపాయలు దక్కాయి. ఈ ఏడాది ఐసిసి చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనప్పటికీ, ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కించుకోని సురేష్ రైనాకు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెరి 1.01 కోట్ల రూపాయలను బిసిసిఐ నుంచి పొందారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదించిన కారణంగా కోచ్ పదవిని పొగొట్టుకున్నాడని అంటున్న అనిల్ కుంబ్లేకు బిసిసిఐ 48 లక్షల రూపాయలు చెల్లించింది.
పదో ఐపిఎల్‌ను కైవసం చేసుకున్న ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రైజ్ మనీ కింద ఇది వరకే 34.29 కోట్ల రూపాయలు వచ్చాయి. బిసిసిఐ తాజాగా ఆ జట్టుకు రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కింద 22.86 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ ఐపిఎల్ సీజన్‌లో మూడో స్థానానికి పరిమితమైన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 15.75 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతోపాటు, రెండో కిస్తీ కింద 21 కోట్ల రూపాయలు లభించాయి. తమతమ క్రికెటర్లను ఐపిఎల్‌లో ఆడేందుకు అనుమతించిన కారణంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులకు చెరి 1.36 కోట్ల రూపాల చెల్లింపులను బిసిసిఐ జరిపింది. అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించిన పంజాబ్, తమిళనాడు, హైదరాబాద్, ముంబయి, మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘాలకు కూడా బిసిసిఐ ఖర్చులు చెల్లించింది.
పలువురు క్రికెటర్లకు, ఐపిఎల్ ఫ్రాంచైజీలకు, చివరికి విదేశీ క్రికెట్ బోర్డులకు కూడా బిసిసిఐ జరిపిన చెల్లింపుల జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ పేర్లు కనిపించకపోవడం విశేషం. వీరికి చెల్లింపులు జరపలేదా? లేక వీరి పేర్లు గల్లంతయ్యాయా? అన్నది ఆసక్తి రేపుతున్నది.

చిత్రం.. రోహిత్ శర్మ