క్రీడాభూమి

విదేశీ టూర్లకు ద్రవిడ్ వెళ్లడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: టీమిండియాతో కలిసి రాహుల్ ద్రవిడ్ విదేశీ టూర్లకు బ్యాటింగ్ సలహాదారు హోదాలో వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. బిసిసిఐ అధికారులతో ఆదివారం సమావేశమైన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత్ ‘ఎ’, అండర్-19 జట్లకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని, అందులోనే తనికి తీరిక లేదని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత జట్టుతో కలిసి ద్రవిడ్ వెళతాడని, అక్కడ బ్యాటింగ్ సలహాదరుగా సేవలు అందిస్తాడని మీడియాలో వచ్చిన వార్తలను వినోద్ రాయ్ తోసిపుచ్చాడు. ఇండియా ‘ఎ’, అండర్-19 జట్ల కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్ల ఫుల్‌టైం కాంట్రాక్టు ఉందని, కాబట్టి అతను సీనియర్స్ జట్టుతో కలిసి టూర్లకు వెళ్లే అవకాశమే లేదని తేల్చిచెప్పాడు. ఒకవేళ అవసరమని చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ భావిస్తే, క్రికెట్ అకాడెమీలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్న సమయంలో ద్రవిడ్ అక్కడ కొద్దికాలం ఉంటాడని చెప్పాడు. రెండేళ్ల కాంట్రాక్టు, ఇతరత్రా షెడ్యూళ్ల వల్ల టీమిండియాతో ద్రవిడ్ పర్యటించడం సాధ్యం కాదని అన్నాడు.
జహీర్‌పై త్వరలో నిర్ణయం
జహీర్ ఖాన్ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని వినోద్ రాయ్ అన్నాడు. అతనిని భారత బౌలింగ్ కోచ్‌గా నియమించినట్టు బిసిసిఐ తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రవి శాస్ర్తీ పట్టుబట్టడంతో, జహార్ పేరును క్రికెట్ సలహా మండలి (సిఎసి) ప్రతిపాదించిన మాట నిజమేగానీ, నిర్ణయం తీసుకోలేదని అంటూ బిసిసిఐ మాట మార్చింది. భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్టు ఆతర్వాత ప్రకటించింది. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా వ్యవహరిస్తున్న సిఎసి తీసుకున్న నిర్ణయాన్ని బుట్టదాఖలు చేయడం ద్వారా బిసిసిఐ వారిని అవమాన పరచిందన్న విమర్శలను వినోద్ రాయ్ ఖండించాడు. కోచ్‌ని నియమించడంలో సిఎసి కీలకంగా వ్యవహరించిందని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు సేవలు అందిస్తున్న కారణంగా జహీర్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించలేదని అన్నాడు. అయితే, టీమిండియాకు జహీర్ సేవలు అవసరమని చెప్పాడు. అందుకే, బహుళ ప్రయోజనాలున్న పదువులను నిర్వహించరాదన్న నిబంధన ప్రకారం జహీర్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘జహీర్‌ను పిలిపి, రెండు మూడు నెలలు లేదా రెండు మూడు వారాలు బౌలింగ్ కోచ్‌గానో, మరో పదవిలోనో ఉండాలని నోటి మాట ద్వారా చెప్పలేం. దానికి స్పష్టమైన విధివిధానాలు అవసరం. నిబంధనలను అనుసరించి, సరికొత్త విధానాలను రూపొందించాల్సిన ఆవస్యకత ఉంది. జహీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, బిసిసిఐ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది’ అన్నాడు.