క్రీడాభూమి

విష్ణువర్ధన్‌కు ప్రెసిడెంట్స్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్టానా (కజకస్థాన్), జూలై 22: భారత టెన్నిస్ ఆటగాడు విష్ణువర్ధన్ ప్రెసిడెంట్స్ కప్ పురుషుల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన తొషిహిదే మత్సుయ్‌తో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో ఎవ్‌గెనీ టైమెవ్, ఎవ్‌గెనీ కర్లొవ్‌స్కీ జోడీని 7-6, 6-7, 10-7 తేడాతో ఓడించి, కెరీర్‌లో రెండు చాలెంజర్స్ టైటిల్‌ను స్వీకరించాడు. విష్ణువర్ధన్, మత్సుయ్ జోడీ నాలుగు బ్రేక్ పాయింట్లలో మూడింటిని సాధించడం విశేషం. కాగా, డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 179వ స్థానంలో ఉన్న విష్ణువర్ధన్ వద్ద 6 ఐటిఎఫ్ ఫ్యూచర్స్ టైటిళ్లు ఉన్నాయి.