క్రీడాభూమి

ప్రాక్టీస్‌లోనే సమయం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత డబుల్స్ షట్లర్లు అవసరానికి మించి ఎక్కువ సమయాన్ని ప్రాక్టీస్‌లోనే వృథా చేస్తున్నారని డెర్మార్క్‌కు చెందిన బాడ్మింటన్ డబుల్స్ స్టార్ కామిల్లా రైటర్ జుల్ అభిప్రాయపడింది. గురువారం ఆమె పిటిఐతో మాట్లాడుతూ, భారత్‌లో డబుల్స్ స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారని, కానీ, వారికి సరైన మార్గదర్శకం లేకపోవడంతో అంతర్జాతీయ టోర్నీల్లో రాణించలేకపోతున్నారని అన్నది. ఎక్కువ సమయం ప్రాక్టీస్‌లోనే గడిపేస్తే ఫిట్నెస్ సమస్యలు పెరుగుతాయని వ్యాఖ్యానించింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పురుషులతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల నైపుణ్యం పెరుగుతుందని చెప్పింది. ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నానని, పతకం సాధించేందుకు కృషి చేస్తానని అన్నది.
ఫైట్‌లో ఖలీకి గాయం
డెహ్రాడూన్, ఫిబ్రవరి 25: ‘ది గ్రేట్’ ఖలీగా క్రీడా ప్రపంచానికి తెలిసిన డబ్ల్యుడబ్ల్యుఇ మాజీ రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా ఒక ఫైట్‌లో గాయపడ్డాడు. హల్ద్‌వానీలో జరిగిన ఫైట్‌లో మైక్ నాక్స్, బ్రాడీ స్టీల్‌తో తలపడిన ఖలీ తలకు, ఛాతీకి గాయాలయ్యాయి. అతనిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు ప్రకటించారు.
ఫోర్బ్స్ జాబితాలో
కోహ్లీ, సైనా, సానియాకు చోటు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో మొత్తం 56 మంది భారతీయులకు చోటు లభించింది.