క్రీడాభూమి

నెట్స్‌లో స్పెషల్ బౌలర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొనేందుకు శనివారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ‘స్పెషల్ బౌలర్’గా అర్జున్ తెండూల్కర్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అయితే, సచిన్ మాదిరి అతను బ్యాటింగ్‌లో కాకుండా బౌలింగ్‌పై ఆసక్తి చూపుతూ, ఆ విభాగంలోనే ఎదుగుతున్నాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుకు అతను నెట్స్ బౌలర్‌గా సేవలు అందించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు నెట్స్‌లో అర్జున్ వేసిన బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో గాయపడ్డాడు. దీనితో అర్జున్ బౌలింగ్ ప్రతిభ అందరికీ తెలిసింది. నెట్స్‌లో అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత మహిళల జట్టుకు లాభించనుంది.