క్రీడాభూమి

సాకర్‌లోనూ కోట్లలో ధర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: క్రికెటర్లకే కాదు.. ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కూడా కోట్ల రూపాయల్లో ధర పలుకుతున్నది. ఆదివారం ఇక్కడ జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ వేలంలో డిఫెండర్ అనాస్ ఎడథోడికా, యూగెనెసన్ లింగ్డో భారీ ధరను దక్కించుకొని ‘కరోడ్‌పతి క్లబ్’లో చేరారు. ఎడథోడికాను ఐఎస్‌ఎల్‌లో కొత్తగా ప్రవేశించిన జంషెడ్పూర్ జట్టు, లింగ్డోను ఎటికె జట్టు తీసుకున్నాయి. వీరిద్దరికీ ఒకే రీతిలో 1.1 కోట్ల రూపాయలు లభించాయి. గోల్‌కీపర్ సుబ్రతా పాల్‌ను జంషెడ్పూర్ ఫ్రాంచైజీ 87 లక్షల రూపాయలు వెచ్చించి కొనింది. రైట్ బ్యాక్ ప్రీతం కోటల్‌కు ఢిల్లీ డైనమోస్ జట్టు 75 లక్షల రూపాయలు వెచ్చించింది. ముంబయి సిటీ ఫుట్‌బాల్ క్లబ్ 65 లక్షల రూపాయలు చెల్లించి స్ట్రయికర్ బల్వంత్ సింగ్‌ను తీసుకుంది. అరిందామ్ భట్టాచార్యకు 64, రినో ఆన్టోకు 63 లక్షల రూపాయలు లభించాయి. ఐఎస్‌ఎల్ వ్యవస్థాపకురాలు, టోర్నమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీతా అంబానీ వేలం ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించింది.
కాగా, స్టార్ ఇమేజ్ ఉన్న పలువురు ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వేలానికి ఉంచలేదు. లేకపోతే, అత్యధిక వేలం ధర మరింత పెరిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఐఎస్‌ఎల్‌లో ఈ ఏడాది మొత్తం 199 మంది ఆటగాళ్లను అమ్మకానికి ఉంచారు. వీరిలో 25 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అనాస్ ఎడథోడికా, యూగెనెసన్ లింగ్డోకు చెరి కోటీ పది లక్షల రూపాయల ధర పలికింది.
వివిధ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు
జంషెడ్యూపూర్ ఫుట్‌బాల్ క్లబ్: అనాస్ ఎడథోడికా (1.1 కోట్లు), సుబ్రతా పాల్ (87 లక్షలు), మెహతాబ్ హుస్సేన్ (50 లక్షలు), సౌవిక్ చక్రవర్తి (45 లక్షలు).
ఢిల్లీ డేనమోస్ ఫుట్‌బాల్ క్లబ్: అల్బినో గోమ్స్ (50 లక్షలు), ప్రీతం కోటల్ (75 లక్షలు), లాంగేట్ (15 లక్షలు), సేనా లార్టే (27 లక్షలు).
ఎఫ్‌సి పుణే సిటీ: అదిల్ ఖాన్ (32 లక్షలు), కీన్ లూయిస్ (40 లక్షలు), లాల్‌చుంగ్ మోయా (45 లక్షలు).
కేరళ బ్లాస్టర్స్: రినో ఆన్టో (63 లక్షలు), లైరుత్తర (25 లక్షలు).
నార్త్ ఈస్ట్ యూనైటెడ్: హలీ చరణ్ నజ్రేరీ (45 లక్షలు), నిర్మల్ చెత్రి (36 లక్షలు).
ఎఫ్‌సి గోవా: నారాయణ్ దాస్ (58 లక్షలు), ప్రణయ్ హల్దార్ (58 లక్షలు).
ఎటికె: యూగెనెసన్ లింగ్డో (1.1 కోట్లు), జయేష్ రాణే (49 లక్షలు).
బెంగళూరు ఎఫ్‌సి: లాల్‌రిండికా రాల్టే (37 లక్షలు), రాహుల్ బెకే (43 లక్షలు).
చెనె్నయిన్ ఎఫ్‌సి: థోయ్ సింగ్ (57 లక్షలు).
ముంబయి సిటీ ఎఫ్‌సి: బల్వంత్ సింగ్ (65 లక్షలు), అరిందామ్ భట్టాచార్య (64 లక్షలు).

చిత్రం.. ముంబయిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ ఫ్రాంచైజీలు వేలానికి పెట్టని మేటి ఫుట్‌బాల్ ఆటగాళ్లతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) వ్యవస్థాపకురాలు నీతా అంబానీ