క్రీడాభూమి

పోరాడి ఓడిన యుఎఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) చివరి వరకూ పోరాడింది. ఓటమి పాలైనప్పటికీ, బలమైన ప్రత్యర్థికి తీవ్ర స్థాయలో పోటీనివ్వడం అందరినీ ఆకట్టుకుంది. టాస్ గెలిచిన యుఎఇ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఎ నిమిది వికెట్లు కోల్పోయ 129 పరుగులు చేసింది. దినేష్ చండీమల్ 50 పరుగులతో టాప్ స్కో రర్‌గా నిలవగా, తిలకరత్నే దిల్షాన్ 27, శేషన్ జయసూర్య 10, చమీర కపుగడెరా 10 చొప్పున పరుగులు చేశారు. యుఎఇ బౌలర్లు అంజద్ జావెద్ మూడు, మహమ్మద్ నవీద్, మహమ్మద్ షాజెద్ చెరి రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. కాగా, లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసినప్పటికీ బ్యాటింగ్‌లో యుఎఇ విఫలమైంది. మొదటి ఓవర్‌లోనే రొహన్ ముస్త్ఫా, మహమ్మద్ షాజెద్ వికెట్లను కోల్పోయన యుఎఇ కోలుకోలేకపోయంది. లక్ష్యాన్ని ఛేదించడాని కి విఫలయత్నం చేసింది. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి, 14 పరుగుల తేడాతో ఓడింది. స్వాప్నిల్ పాటిల్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.