క్రీడాభూమి

హర్మన్‌కు సూపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 24: ప్రస్తుతం వెస్టర్న్ రైల్వేస్‌లో పని చేస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూపర్ ఆఫర్ ఇచ్చాడు. మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో అజేయ శతకంతో రాణించిన హర్మన్ అంగీకరిస్తే, ఆమెకు పంజాబ్ పోలీస్ శాఖలో డిఎస్పీగా నియమిస్తామని ప్రకటించాడు. గతంలో ఆమెకు పంజాబ్ సర్కారు ద్వారా అన్యాయం జరిగిందని, దానిని ఇప్పుడు తాను సరి చేస్తానని తెలిపాడు.
ఘన సన్మానానికి ఏర్పాట్లు
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టును ఘనంగా సన్మానించడానికి బిసిసిఐ ఏర్పాట్లు చేస్తున్నది. ఇంగ్లాండ్ నుంచి జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే సన్మాన కార్యక్రమం ఉంటుందని. జట్టులోని ప్రతి ఒక్కరిటీ తలా 50 లక్షల రూపాయల చెక్కును బిసిసిఐ అందిస్తుంది. అదే విధంగా సపోర్టింగ్ స్ట్ఫాలోని సభ్యులకు తలా 25 లక్షల రూపాయలు దక్కుతాయి.