క్రీడాభూమి

బోర్డు అధికారులకు సిఒఎ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న పాలనాధికారుల బృందం (సిఒఎ) గురువారం పాలక మండలి సభ్యులకు నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశం (ఎస్‌జిఎం)కు బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో హాజరైన రాహుల్ జోహ్రీని బయటకు వెళ్లాల్సిందిగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జోహ్రీ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. కాగా, అమితాబ్ చౌదరి చర్యపై సిఒఎ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అతనితోపాటు బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తదితరులకు కూడా నోటీసులు జారీ చేసింది. జోహ్రీతోపాటు బోర్డు జనరల్ మేనేజర్ ఎంవి శ్రీ్ధర్‌ను కూడా సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకోవడం వివరణ కోరింది.
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా బిసిసిఐ మెలిక పెట్టడంపై కూడా సిఒఎ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు కీలక అంశాలను మినహాయించి, మిగతా అంశాలకు బిసిసిఐ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.

చిత్రం.. రాహుల్ జోహ్రీ