క్రీడాభూమి

అస్తశ్రస్త్రాలతో అభ్యర్థులు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్: ఫిఫా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఐదుగురు అభ్యర్థులు ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్, సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫా, జెరోమ్ చాంపేంజ్, టోక్యో సెక్స్‌వెల్, గియానీ ఇన్ఫాటినో అస్తశ్రస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం జరిగబోయే ఎన్నికల్లో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరికివారే ఎత్తుగడల్లో మునిగితేలుతున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సెప్ బ్లాటర్, నిన్నమొన్నటి వరకూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్న ఉపాధ్యక్షుడు, యూఫా చీఫ్ మైఖేల్ ప్లాటినీ ఆరేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమపై తీసుకున్న చర్యను సవాలు చేస్తూ వారు క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)లో అప్పీల్ చేసుకోవచ్చు. కానీ, ఇద్దరూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఇలావుంటే, 17 సంవత్సరాలు ఫిఫా అధ్యక్షుడిగా కొనసాగి, సంస్థపై తనదైన ముద్ర వేసిన బ్లాటర్‌కు పాలనాదక్షుడిగా మంచి పేరు ఉంది. అవినీతి ఆరోపణలు ఎలావున్నా, ఫిఫా నష్టాల నుంచి బయటపడడానికి, ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు, ఆస్తులు ఉన్న సంస్థగా ఎదగడానికి బ్లాటర్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నది వాస్తవం. అతని స్థానాన్ని భర్తీ చేసే సత్తా ప్రస్తుతం పోటీపడుతున్న వారికి ఉందా అన్నది అనుమానమే. మొత్తం మీద బ్లాటర్, ప్లాటినీ లేని ఫిఫా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.