క్రీడాభూమి

భారత మహిళా క్రికెటర్లు ఓడి గెలిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ జూలై 27: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పటికీ, మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత క్రికెటర్లు కోట్లాది మంది మనసులను గెల్చుకున్నారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. వరల్డ్ కప్ రన్నర్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న భారత మహిళా క్రికెటర్లను ఆయన గురువారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లాండ్‌కు భారత క్రీడాకారిణులు తుది వరకూ గట్టిపోటీనిచ్చారని చెప్పారు. వీరి స్ఫూర్తిదాయక ప్రతిభ భవిష్యత్తులో ఎంతో మంది యువతులను క్రీడల పట్ల ఆకర్షింప చేస్తుందని ప్రశంసించారు. రియో ఒలింపిక్స్ నుంచి పారాలింపిక్స్ వరకూ అన్ని మేజర్ టోర్నీల్లో, హాకీ, రెజ్లింగ్, బాడ్మింట్ తదితర క్రీడల్లో భారత మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ భారత మహిళలు గొప్పగా ఆడారని చెప్పారు. భారత మహిళలు ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారని అభినందించారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ (అమ్మాయిలను రక్షించండి.. వారిని చదివించండి) అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ‘బేటీ ఖిలావో’ (అమ్మాయిలను ఆడించండి) అన్న పదాన్ని కూడా జోడించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. క్రీడా రంగంలోకి రావాల్సిందిగా యువతకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గోయల్ గుర్తుచేశారు. ‘ఖేలోగే తో ఖిలోగే’ (ఆడితేనే వికాసం) అన్నదే కేంద్ర లక్ష్యమని చెప్పారు. క్రీడలకు కేంద్రం ఇతోథిక సాయం చేస్తున్నదని అన్నారు. భారత కెప్టెన్ మిథాలీ రాజ్, ఆమె సహచర క్రీడాకారిణులతోపాటు సపోర్టింగ్ స్ట్ఫాను కూడా మంత్రి గోయల్ సన్మానించారు. అందరికీ చెక్కులు అందించారు. పలువురు క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిత్రం.. న్యూఢిల్లీలో గురువారం భారత మహిళా క్రికెటర్ల సన్మాన కార్యక్రమంలో కెప్టెన్ మిథాలీ రాజ్‌కు చెక్కును బహూకరిస్తున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్