క్రీడాభూమి

చిత్తశుద్ధిలేని సిఎ: వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 28: ఆటగాళ్ల డిమాండ్లను నెరవేర్చడంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ)కు చిత్తశుద్ధి లేదని ఓపెనర్, జాతీయ జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధ్వజమెత్తాడు. సిఎ ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నిజానికి సమస్య పరిష్కారం దిశగా అధికారులు ప్రయత్నించడం లేదని ఒక ఇంటర్వ్యూలో వార్నర్ విమర్శించాడు. కొత్త ఒప్పందంపై వెంటనే సంతకం చేయాల్సిందిగా ఆటగాళ్లకు సిఎ లేఖ రాయడంపై అతను స్పందిస్తూ, అసలు సమస్యలను పక్కకుపెట్టి కొత్తకొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని అన్నాడు. క్రికెటర్ల సంఘం (ఎసిఎ)తో చర్చలు జరిపిన తర్వాత రాజీ సూత్రాన్ని ప్రకటిస్తున్నామంటూ సిఎ చేసిన సూచనల పట్ల వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్లతోపాటు, ఫస్ట్‌క్లాస్ స్థాయి ఆటగాళ్లకు కూడా లాభాల్లో వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సిఎ తన లేఖలో పేర్కొంది. అయితే, ఎసిఎ ఈ ప్రతిపాదనకు ఆమోదం చెప్పినట్టు ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని వార్నర్ తప్పుపడుతున్నాడు. సిఎ, ఎసిఎ మధ్య కాంట్రాక్టుపై చాలాకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీతోనే గత కాంట్రాక్టు పూర్తికాగా, ఈనెల ఒకటి నుంచి కొత్త ఒప్పందాలు అమలుకావాల్సి ఉన్నప్పటికీ, ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో పరిస్థితి ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కాంట్రాక్టు మొత్తాన్ని పెంచాలన్న ఎసిఎ డిమాండ్‌ను సిఎ ఖాతరు చేయలేదు. వాటాల పేరుతో జీత భత్యాల పెంపు అంశాన్ని సిఎ పక్కతోవ పట్టిస్తున్నదని ధావన్ విమర్శించాడు. కొత్త కాంట్రాక్టుపై సంతకం చేసేది లేదని తేల్చిచెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను బహిష్కరించే అవకాశాలు లేకపోలేదన్నాడు.